విరాట్‌కు అనుష్క స్వీట్ హగ్

బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకుని, ఆ తర్వాత కూడా నచ్చిన పాత్రలు చేస్తూ హీరోయిన్‌గానూ, కొన్ని చిన్న చిన్న సినిమాలను నిర్మిస్తూ నిర్మాతగానూ బాధ్యతలు నిర్వర్తిస్తుంది. సినీ కెరీర్ తో పాటూ, అనుష్క తల్లిగా, భార్యగా బాధ్యతలను ఎంతో గౌరవంగా కంటిన్యూ చేస్తోంది.
విరాట్ కోహ్లీకు సంబంధించిన ఇంపార్టెంట్ మ్యాచ్‌లు ఉంటే అనుష్క తప్పకుండా స్టేడియంకు వస్తోంది. అనుష్క మ్యాచ్ కు వచ్చిన ప్రతిసారీ కోహ్లీ, అనుష్క కు సంబంధించిన మూమెంట్స్ హైలైట్ అవడం కామన్. ఎప్పటిలానే నిన్న జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు కూడా అనుష్క హాజరైంది. తన భర్త ఆడుతున్నంత సేపు సూపర్ జోష్‌లో కనిపించిన అనుష్క, కోహ్లీ అవుట్ అవగానే నిరాశ పడింది.
చివరకు నిన్న ఇండియా మ్యాచ్ ఓడిపోవడంతో అందరితో పాటూ కోహ్లీ కూడా ఎంతో బాధపడ్డాడు. తనకు వరల్డ్ కప్ మ్యాచ్‌ల్లో ఎక్కువ స్కోర్ చేసిన ప్లేయర్ గా అఛీవ్‌మెంట్ అవార్డు వచ్చినా కూడా ఆ ఆనందం అతని కళ్లల్లో కనిపించలేదు. అలాంటి టైమ్ లో దగ్గరకు వచ్చిన అనుష్క విరాట్‌ను ఎంతో ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని కౌగిలించుకుంది. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. ఏదేమైనా అనుష్క తన పాత్రకు అన్ని విధాల భలే న్యాయం చేస్తోందని అనుష్కను కొనియాడుతున్నారు.






