డీజే టిల్లు-2 లో అనుపమ పరమేశ్వరన్ కి ఛాన్స్

డీజే టిల్లు మూవీ హిట్‌తో సిద్ధు జొన్నలగడ్డ పేరు ఒక్కసారిగా టాలీవుడ్‌లో, యూత్ లో ఒక్కసారిగా మారుమోగిపోయింది. ఈ యంగ్ హీరో ఎక్కడికి వెళ్లినా.. సొంత పేరు మర్చిపోయి అందరూ డీజే టిల్లు అనే పిలుస్తున్నారు. ఈ ఏడాది బాక్సాఫీసు చిత్రాల హిట్ లిస్ట్‌లో డీజే టిల్లుమూవీ ఒకటి. చిన్న సినిమాగా ఆడియన్స్ ముందుకు వచ్చి, బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. విమల్ కృష్ణ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి హీరోహీరోయిన్స్‌గా నటించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 12న థియేటర్స్‌లో సందడి చేసిన ఈ సినిమా సౌండ్ ఇప్పటికీ వినిపిస్తోంది. ఇందులోని డైలాగ్స్, సాంగ్స్‌ను సినీ ప్రియులు అంత ఈజీగా మర్చిపోలేకున్నారు. ఈ సినిమా తరువాత సిద్ధు జొన్నలగడ్డ పేరు డీజే టిల్లుగా మారిపోయింది. ఆయన అసలు పేరు మర్చిపోయేంతలా ఈ మూవీ ఆడియన్స్‌కు ఎక్కేసింది. అయితే ఇప్పుడు అందరూ డీజే టిల్లు పార్ట్-2 కోసం వెయిట్ చేస్తున్నారు.
తాజాగా డీజే టిల్లు-2పై ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా రాధికాగా నటించిన నేహా శెట్టి ప్లేస్‌లో అనుపమ పరమేశ్వరన్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించపోయినా.. సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అనుమప పరమేశ్వరన్ కెరీర్ మళ్లీ ఊపందుకుంది. ఈ ఏడాది మొదట్లో వచ్చిన రౌడీ బాయ్స్ సినిమాతో ఆడియన్స్‌ను అలరించింది ఈ మలయాళ బ్యూటీ. తాజాగా కార్తికేయ 2 మూవీలో నిఖిల్ సిద్దార్థ్ సరసన హీరోయిన్‌గా నటించింది. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో మరో సూపర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం నిఖిల్‌తోనే కలిసి 18 పేజెస్ మూవీ చేస్తోంది.






