శంషాబాద్ నుంచి మరో నాలుగు విమాన సర్వీసులు
శంషాబాద్ విమానాశ్రయం నుంచి మరో నాలుగు విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఎయిర్‌ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థ సహకారంతో ఈ విమానాలు అమృత్‌సర్, లఖ్‌నవూ, కొచ్చి, గ్వాలియర్‌లకు రాకపోకలు సాగించనున్నాయని విమానాశ్రయ అధికారులు తెలిపారు. శుక్రవారం నుంచి అమృత్‌సర్, లఖ్‌నవూ, కొచ్చిలకు సేవలు ప్రారంభించినట్లు జీఎమ్మార్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ లిమిటెడ్ సీఈవో ప్రదీప్ పణికర్ తెలిపారు. గ్వాలియర్‌కు నవంబరు 28 నుంచి ప్రారంభం కానున్నాయి. మెరుగైన ప్రయాణ సౌకర్యాల కోసం ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థ ముందుకు రావడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
Tags :