సీఎం వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న విమానం అత్యవసర ల్యాండింగ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్లే విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ల్యాండింగ్ చేసినట్లు అధికారులు వెల్లడిరచారు. సాయంత్రం 5:03 గంటలకు బయలు దేరిన విమానం 5:26 గంటలకు అత్యవసరంగా ల్యాండ్ అయినట్లు తెలుస్తోంది. దీంతో ఢిల్లీ వెళ్లాల్సిన జగన్ గన్నవరం విమానాశ్రయ లాంజ్‌లో వేచి చూస్తున్నారు. ముఖ్యమంత్రి వెంట సీఎస్ జవహార్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, అధికారులు పూనం మాలకొండయ్య, కృష్ణ మోహన్ రెడ్డి, చిదానందరెడ్డి ఉన్నారు. ఢిల్లీ చేరుకున్న తర్వాత జగన్ రాత్రికి 1 జనపథ్ నివాసంలో బస చేయాల్సి ఉంది. మంగళవారం ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్‌లో దౌత్యవేత్తలతో జరగనున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లో పాల్గొనాల్సి ఉంది.
Tags :