కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన...షెడ్యూల్ ఇదే

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన...షెడ్యూల్ ఇదే

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ పార్టీ ఈ నెల 21న మునుగోడులో పార్టీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3:40 గంటలకు అమిత్‌ షా ప్రత్యేక విమానంలో శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో సాయంత్రం 4:15 గంటలకు మునుగోడుకు చేరుకుంటారు.  4:40  నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు మునుగోడు సభలో పాల్గొంటారు. అమిత్‌ షా సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కాషాయ కండువా కప్పుకోనున్నారు.  తిరిగి అమిత్‌ షా మునుగోడు నుంచి హెలికాప్టర్‌లో 6:25 గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుని 6:30 గంటలకు ఢల్లీికి పయనమవుతారు.

 

Tags :