బీజేపీ అధికారంలోకి రాగానే... సెప్టెంబరు 17ను : అమిత్ షా
బీజేపీ అధికారంలోకి రాగానే సెప్టెంబరు 17ను అధికారికంగా నిర్వహిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. వరంగల్‌లో నిర్వహించిన సకల జనుల విజయ సంకల్ప సభలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పేరుతోనూ అవినీతికి పాల్పడ్డారు. తెలంగాణ తొలి సీఎం దళితుడే అని సీఎం కేసీఆర్ చెప్పారు. రెండు సార్లు అధికారంలోకి వచ్చిన దళితుడిని సీఎం చేయలేదు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు బీసీ విరోధ పార్టీలు. తెలంగాణ యువతను సీఎం కేసీఆర్ మోసం చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీతో యువత జీవితాలలతో ఆడుకున్నారు.
ఒవైసీకి లొంగి తెలంగాణ విమోచన దినోత్సవం జరపలేదు. మిగులు రాష్ట్రాంగా ఏర్పడిన తెలంగాణ అప్పులపాలైంది. మియాపూర్ భూములు, కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ కుంభకోణం జరిగింది. స్మార్ట్ సిటీ కింద కేంద్ర ఇచ్చిన నిధులను కేసీఆర్ దుర్వినియోగం చేశారు. ప్రధాని మోదీ ఓబీసీలకు సముచిత స్థానం కల్పించారు. ఎంబీబీఎస్ సీట్లలో బీసీలకు 25 శాతం రిజర్వేషన్లు కల్పించాం అని అన్నారు.