మహానాడులో అమెరికా ఎన్నారై టీడిపి నాయకులు

రాజమండ్రిలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడులో అమెరికాలోని ఎన్నారై టీడిపి నాయకులు పాల్గొన్నారు. ఎన్నారై టీడీపి యుఎస్‌ఎ కో ఆర్డినేటర్ జయరాం కోమటితోపాటు రవి మందలపు, బుచ్చిరాం ప్రసాద్, మోహన కృష్ణ మన్నవ, కృష్ణ గొంప తదితర నాయకులు మహానాడులో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్నారై టీడిపి నాయకులు జయరాం కోమటి మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును అధికారంలోకి తీసుకురావడమే ఎన్నారై టీడిపి లక్ష్యమని ప్రకటించారు. అమెరికాలో వివిధ నగరాల్లో తెలుగు దేశం పార్టీ మహానాడు, ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను వైభవంగా జరిపామని తెలిపారు. వివిధ నగరాల్లో జరిగిన వేడుకల వివరాలను పుస్తకరూపంలో ముద్రించి చంద్రబాబు నాయుడుకు ఎన్నారై టీడిపి నాయకులు అందజేశారు.కాగా ఈ మహానాడుకు 20 వేల మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది కార్యకర్తలు తరలివచ్చారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఎన్నారై టీడిపి నాయకులు చేస్తున్న కృషిని ప్రశంసించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఎన్నారై టీడిపి నాయకులు కృషి చేయాలని కోరారు.






