అమెజాన్ ఆన్‌లైన్‌ అకాడమీ మూత!

అమెజాన్ ఆన్‌లైన్‌ అకాడమీ మూత!

కరోనా లాక్‌డౌన్‌ల సమయంలో రెండేళ్ల క్రితం ప్రారంభించిన ఆన్‌లైన్‌ శిక్షణ వేదిక అమెజాన్‌ అకాడమీ ప్లాట్‌ఫామ్‌ ను మూసివేయనున్నట్లు ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ప్రకటించింది. అందుకు కారణాలు మాత్రం వెల్లడిరచలేదు.  ప్రస్తుత వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని మూసివేత ప్రక్రియను దళలవారీగా చేపట్టనున్నట్టు  తెలిపింది. లాక్‌డౌన్‌ సమయంలో దేశంలోని విద్యార్థుల కోసం వర్చువల్‌ శిక్షణను అమెజాన్‌ ప్రారంభించింది. జేఈఈ సహా అనేక పోటీ పరీక్షలపై విద్యార్థులను ఆన్‌ లైన్‌లో శిక్షణ కొనసాగిస్తోంది. విద్యాసంస్థలు, కోచింగ్‌ సెంటర్లు యథావిధిగా తెరుచుకున్న నేపథ్యంలో అమెజాన్‌ తాజా ప్రకటన చేసింది.

 

 

Tags :