Radha Spaces ASBL

‘భీమ్లా నాయక్’కు ఓటీటీ క్రేజీ ఆఫర్?

‘భీమ్లా నాయక్’కు ఓటీటీ క్రేజీ ఆఫర్?

పవర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘భీమ్లా నాయ‌క్‌’. ఈ సినిమాను సంక్రాంతి సంద‌ర్భంగా విడుద‌ల చేయాల‌నుకుంటున్నారు. అయితే థియేట‌ర్స్ లో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయ‌డానికి అమెజాన్ ప్రైమ్ సంస్థ నిర్మాత‌ల‌కు టెంప్టింగ్ అమౌంట్‌ను ఆఫ‌ర్ చేసింద‌ని టాక్ వినిపిస్తోంది. కోవిడ్ స‌మ‌యంలో థియేట‌ర్స్ మూత‌ప‌డ్డ‌ప్పుడు నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్, ఎంఎక్స్‌ప్లేయ‌ర్ స‌హా ప‌లు ఓటీటీ సంస్థ‌లు సినిమాల‌ను నేరుగా త‌న ఓటీటీల ద్వారా ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్లాయి. ఇప్పుడు థియేట‌ర్స్ ఓపెన్ అయ్యాయి. కానీ ఓటీటీలు స్టార్స్ ఉన్న సినిమాల‌ను డైరెక్ట్ రిలీజ్ చేయ‌మ‌ని బేర‌సారాలు చేస్తూనే ఉన్నాయి. టెంప్టింగ్ ఆఫ‌ర్స్ ఇస్తూనే ఉన్నాయి.

తాజాగా ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘భీమ్లా నాయ‌క్‌’కు ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ డైరెక్ట్ రిలీజ్ చేయ‌డానికి భారీ మొత్తాన్ని ఆఫ‌ర్ చేసిందనే టాక్ సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు దాదాపు రూ.140 కోట్ల రూపాయ‌ల డీల్‌ను అమెజాన్ ఆఫ‌ర్ చేసింద‌ట‌. ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైతం ఏది లాభ‌సాటిగా అనిపిస్తే దాని ప్ర‌కార‌మే వెళ్ల‌మ‌ని నిర్మాత ఛాయిస్‌కే వ‌దిలేసిన‌ట్లు వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. నిజానికి ఇది చాలా పెద్ద డీల్ అనే చెప్పాలి. రూ.140 కోట్ల ఆఫ‌ర్ అంటే మామూలు విష‌యం కాదు. ఇది కాకుండా శాటిలైట్‌, హిందీ డ‌బ్బింగ్ రైట్స్ ఇలా.. నిర్మాత పూర్తిగా సేఫ్ అయిపోతాడు.

అయితే నిర్మాత అలా చేస్తే డిస్ట్రిబ్యూట‌ర్స్‌, ఎగ్జిబిట‌ర్స్ అనేవారు ఊరుకుంటారా? ఒక‌వేళ వాళ్లు ఊరుకున్నా ప‌వ‌ర్‌స్టార్ సినిమాను థియేట‌ర్స్‌లో చూడాల‌నుకునే ఆయ‌న హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఊరుకుంటారా? అనేది ఆలోచించాల్సిన విష‌య‌మే. ఈ సినిమా నుంచి వ‌చ్చిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్, రానా ద‌గ్గుబాటి క్యారెక్ట‌ర్స్ ఎలివేష‌నల్ టీజ‌ర్స్‌, టైటిల్ ట్రాక్‌, ఓ రొమాంటిక్ ల‌వ్ ట్రాక్ సాంగ్స్‌తో సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. సినిమా కోసం ప్రేక్షకులు, పవర్ స్టార్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మ‌ల‌యాళ చిత్రం ‘అయ్య‌ప్ప‌నుమ్ కోశియ‌మ్‌’కు తెలుగు రీమేక్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్గానారు. కాగా.. తెలుగు నెటివిటీ తగ్గట్టు మార్పులు చేర్పులు చేసి ప్రముఖ ద‌ర్శ‌కుడు, రైట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, మాట‌ల‌ను అందిస్తున్నారు. ప‌వ‌న్‌కు జోడీగా నిత్యామీన‌న్ న‌టిస్తుండ‌గా, రానా జోడీగా సంయుక్తా మీన‌న్ న‌టిస్తున్నారు. 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :