విశాఖపట్నం-బెంగళూరు మధ్య ఆకాశ ఎయిర్‌

విశాఖపట్నం-బెంగళూరు మధ్య ఆకాశ ఎయిర్‌

బెంగళూరు-విశాఖపట్నం మధ్య డిసెంబర్‌ 10 నుంచి విమాన సర్వీసులు ప్రారంభిస్తామని ఆకాశ ఎయిర్‌ వెల్లడిరచింది. ఈ మార్గంలో రోజూ రెండు విమానాలు నడపనున్నట్లు తెలిపింది. మొదటి సర్వీసు డిసెంబరు 10న, రెండో సర్వీసు 12 నుంచి అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. ఈ ఏడాది ఆగస్టులో కార్యకలాపాలు ప్రారంభించాక కంపెనీ అందుబాటులోకి తెస్తున్న 10వ మార్గం ఇదే. డిసెంబర్‌ 17 నుంచి బెంగళూరు-అహ్మదాబాద్‌ మార్గంలో మూడో విమాన సర్వీసును ప్రారంభించనున్నట్లు కంపెనీ తెలిపింది. పుణె-బెంగళూరు మధ్య నవంబర్‌ 26 నుంచి రోజు రెండు విమాన సర్వీసులు నడుపుతుండగా, మూడో సర్వీసు డిసెంబరు 10న ప్రారంభమవుతుందని ఆకాశ ఎయిర్‌ తెలిపింది.

 

 

Tags :