Radha Spaces ASBL

అమెరికా, యూరోప్‌ దేశాలకు... ఎయిర్‌ ఇండియా నాన్‌స్టాఫ్‌ సర్వీస్‌లు

అమెరికా, యూరోప్‌  దేశాలకు...  ఎయిర్‌ ఇండియా నాన్‌స్టాఫ్‌ సర్వీస్‌లు

అమెరికా, యూరోప్‌ దేశాల్లోని ఆరు ప్రాంతాలకు నాన్‌ స్టాప్‌ విమాన సర్వీస్‌లను ఎయిర్‌ ఇండియా ప్రారంభించనుంది. ముంబై, న్యూఢల్లీిల నుంచి ఈ విమాన సర్వీస్‌లను ప్రారంభిస్తామని ఎయిర్‌ ఇండియా తెలిపింది. ముంబై నుంచి న్యూయార్క్‌, ప్యారీస్‌, ఫ్రాంక్‌ఫోర్ట్‌, ఢల్లీి నుంచి కోపెన్‌హగ్‌, మిలాన్‌, వియన్నా నగరాలకు నాన్‌ స్టాప్‌ విమాన సర్వీసులను ఎయిర్‌ ఇండియా నడపనుంది. ముంబై-న్యూయార్క్‌ విమాన సర్వీస్‌ 2023 ఫిబ్రవరి 14న ప్రారంభం కానుంది. న్యూఢల్లీి-న్యూయార్క్‌ మధ్య ప్రస్తుతం నడుస్తున్న రోజువారి విమాన సర్వీస్‌లకు ఇది అదనం. కొత్త సర్వీస్‌లు జాన్‌ ఎఫ్‌కెనడీ అంతర్జాతీయ విమానాశ్రయానికి నడుస్తాయి. ప్రస్తుతం వారానికి నాలుగు సర్వీసులు న్యూయార్క్‌ లిబర్టీ ఎయిర్‌ ఫోర్టుకు నడుస్తున్నాయని ఎయిర్‌ ఇండియా తెలిపింది. దీంతో మొత్తం అమెరికాకు వారానికి 47 నాన్‌ స్టాప్‌ విమాన సర్వీసులు అవుతాయని తెలిపింంది. యూరోప్‌కు వారానికి 4 సర్వీస్‌లు నడపనున్నట్లు తెలిపింది. న్యూఢల్లీి- మిలాన్‌ నగరాల మధ్య సర్వీస్‌ 2023, ఫిబ్రవరి 1 నుంచి, న్యూఢల్లీి-వియాన్న, న్యూఢల్లీి` కోపెన్‌హగ్‌ మధ్య ఫిబ్రవరి 18 నుంచి సర్వీస్‌లు నడుస్తాయని ఎయిర్‌ ఇండియా తెలిపింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :