MKOne Telugu Times Youtube Channel

బే ఏరియాలో ఘనంగా ‘స్వదేశ్‌’ స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు

బే ఏరియాలో ఘనంగా ‘స్వదేశ్‌’ స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు

విశ్వనటుడు కమలహాసన్‌ హాజరు...అభిమానుల హుషారు

బే ఏరియాలో భారతదేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవ(ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌) వేడుకలను అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండో అమెరికన్స్‌ (ఎఐఎ), బాలీ 92.3 ఆధ్వర్యంలో ఎన్నారైలు స్వదేశ్‌ పేరుతో ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలకు బే ఏరియాలో 39కి పైగా భారతీయ సంస్థలు హాజరయ్యాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు పద్మభూషణ్‌ కమల్‌ హాసన్‌ హాజరయ్యారు. కమల్‌ హసన్‌ తన 63 సంవత్సరాల ‘‘కమలిజం’’ (కెరీర్‌)తోపాటు అతని తాజా చిత్రం విక్రమ్‌ విజయాన్ని జరుపుకుంటున్న వేళలో ఇక్కడికి రావడం అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. కమలహాసన్‌కు ఎన్నారైలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన నటించిన సినిమాల జాబితాతో ప్రత్యేక జ్ఞాపికను కూడా అందించి సత్కరించారు. తనకు గత 60 సంవత్సరాలుగా మద్దతు ఇస్తున్న అభిమానులకు కమల్‌ ధన్యవాదాలు తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి దేశాభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు.

భారత జెండాను భారత కాన్సుల్‌ జనరల్‌ (ఎస్‌ఎఫ్‌ఓ) డాక్టర్‌ టీ.వి. నాగేంద్ర ప్రసాద్‌ ఎగురవేశారు. ఈ వేడుకలకు హాజరైన ప్రముఖులలో మేయర్‌ రిచ్‌ ట్రాన్‌ (మిల్పిటాస్‌), మేయర్‌ సామ్‌ లిక్కార్డో (శాన్‌ హోసె), రాష్ట్ర సెనేటర్‌ బాబ్‌ వికోవ్స్ కు, శాంటా క్లారా కౌంటీ సూపర్‌వైజర్‌ సిండి చావెజ్‌, కౌంటీ సూపర్‌వైజర్‌ ఒట్టో లీ, శాంటా క్లారా డిస్ట్రిక్ట్‌ అటార్నీ జెఫ్‌ రోసెన్‌, కాంగ్రెస్‌మెన్‌ రో ఖన్నా కార్యాలయ ప్రతినిధులు సెనేటర్‌ డేవ్‌ కోర్టేస్‌, అసెంబ్లీ సభ్యుడు యాష్‌ కల్రా, అసెంబ్లీ సభ్యుడు అలెక్స్‌ లీతోపాటు ఇతర నగరాలకు చెందిన మేయర్ లు ఈ వేడుకకు హాజరయ్యారు. కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌ బొంటా, కాంగ్రెస్‌ ఉమెన్‌ అన్నా ఎషూ మరియు ఓక్లాండ్‌ మేయర్‌ లిబ్బి షాఫ్‌ వీడియో సందేశాలు పంపి భారతీయులుకు శుభాకాంక్షలు తెలియజేశారు.

జెండా ఎగురవేసిన అనంతరం పలువురు ప్రముఖులు అందరికీ 75వ భారత స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు, భారతీయుల దేశభక్తిని చూసి సంతోషిస్తున్నామని, దీన్ని చిరస్మరణీయమైన కార్యక్రమంగా మార్చినందుకు ఎఐఎ బృందానికి అభినందనలు తెలిపారు. డా. టీ.వి. నాగేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ, భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుండి ప్రాతినిధ్యం వహించడం, మన వారసత్వం మరియు సంస్కృతిని పరిరక్షించడంలో ఎఐఎ చూపుతున్న చొరవను అభినందిస్తూ, తన సంతోషాన్ని తెలియజేశారు.

ఈ ఈవెంట్‌కు గ్రాండ్‌ స్పాన్సర్‌ గా సంజీవ్‌ గుప్తా (సిపిఎ), పవర్‌డ్‌ బై రియల్టర్‌ నాగరాజ్‌ అన్నయ్య వ్యవహరించారు. ఇతర స్పాన్సర్‌లుగా ఐసిఐసీఐ బ్యాంక్‌, ఆజాద్‌ ఫైనాన్షియల్స్‌, సంపూర్ణ ఆయుర్వేద, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (సిఎ) వ్యవహరించాయి.

భారతీయ సంస్కృతి, కళా రూపాలను ప్రదర్శించడం, ప్రచారం చేయడం స్వదేశ్‌ యొక్క ముఖ్య నినాదాలలో ఒకటి. సాంస్కృతిక కార్యక్రమాలు మిలే సుర్‌ మేరా - వివిధ రాష్ట్రాల నుండి గొప్ప సంగీత కళాకారులు ప్రదర్శించిన వినోద, రాష్ట్ర నృత్యాలు, శాస్త్రీయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. దాదాపు 200 మంది పిల్లలు క్లాసికల్‌, ఫిల్మ్‌ డ్యాన్స్‌లలో పాల్గొన్నారు. క్యారమ్స్‌, చెస్‌ పోటీలు నిర్వహించారు. ‘‘జన గణ మన’’ బృందగానం, 100 అడుగుల భారతీయ జెండా పరేడ్‌ యొక్క ముఖ్యాంశాలలో ఒకటిగా నిలిచాయి. సెన్సేషనల్‌ సింగర్‌ విద్యా వోక్స్‌ ద్వారా ప్రత్యక్ష సంగీత కచేరీ అందరినీ మైమరపింపజేసింది. యూత్‌ను తన పాటలతో విద్యావోక్స్‌ ఆకట్టుకున్నారు.

ఈవెంట్‌ను గ్రాండ్‌గా విజయవంతం చేయడంలో కృషి చేసిన వాలంటీర్లందరికీ ఎఐఎ బృందం ధన్యవాదాలు తెలిపింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు దాదాపు 10,000 మందికి పైగా హాజరయ్యారు.

అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండో అమెరికన్స్‌ అనేది యునైటెడ్‌ స్టేట్స్‌లో నివసిస్తున్న భారతీయ అమెరికన్‌ కమ్యూనిటీ యొక్క గొప్ప మరియు వైవిధ్యమైన వారసత్వాన్ని అందించడానికి ఏర్పడిన లాభాపేక్షలేని సంస్థ. ఎఐఎ యొక్క లక్ష్యం సభ్యుల మధ్య సాంస్కృతిక మరియు సామాజిక పరస్పర సహకారాన్ని ప్రోత్సహించడం విస్తరించడం, భారత ఉపఖండానికి సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు మరియు విద్యా కార్యక్రమాలను సులభతరం చేయడం, భారత ఉపఖండంలోని విభిన్న సాంస్కృతిక వారసత్వాన్ని జరుపుకోవడం మరియు ఈ గొప్ప సంస్కృతిని సంఘంతో పంచుకోవడం వంటివి ముఖ్య ఆశయాలుగా ఎఐఎ పనిచేస్తోంది.

ఈ వేడుకలకు సహకరించిన సంస్థలు...

అమెరికన్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ బీహార్‌ (AODB)
ఆశాజ్యోతి సంస్థ
అమెరికాలో రాజస్థాన్‌ అసోసియేషన్‌ (బే ఏరియా)
బీహార్‌ ఫౌండేషన్‌ (కాలిఫోర్నియా బ్రాంచ్‌)
బాటా - బే ఏరియా తెలుగు అసోసియేషన్‌
బిఎటిఎం - బే ఏరియా తమిళ్‌ మన్రం
బే మలయాళీ
బీహార్‌ అసోసియేషన్‌
బ్రహ్మ కుమారీలు 
ఫెడరేషన్‌ ఆఫ్‌ మలయాళీ అసోసియేషన్స్‌ ఆఫ్‌ అమెరికా 
గుజరాతీ కల్చరల్‌ అసోసియేషన్‌ (GCA) 
గోపియో (గ్లోబల్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ది పీపుల్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆరిజిన్‌) 
ఐఎల్‌పి (భారత అక్షరాస్యత ప్రాజెక్ట్‌) 
ఇండో అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ బే ఏరియా
ఐఎసిఎఫ్‌ - ఇండో-అమెరికన్‌ కమ్యూనిటీ ఫెడరేషన్‌ 
కెకెఎన్‌సి (కన్నడ కూట ఆఫ్‌ ఉత్తర కాలిఫోర్నియా)
కెటిఎఫ్‌ - కాశ్మీరీ టాస్క్‌ ఫోర్స్‌ 
వీAచీజA
నాయర్‌ సర్వీస్‌ సొసైటీ 
ఓఎస్‌ఎ (కాలిఫోర్నియా చాప్టర్‌) 
పాఠశాల (తెలుగు పాఠశాల)
పిసిఎ (పంజాబీ కల్చరల్‌ అసోసియేషన్‌) 
రోటరీ ఇంటర్నేషనల్‌
ఎస్‌ఆర్‌సిఎ (శాన్‌ రామన్‌ క్రికెట్‌ అసోసియేషన్‌)
ఎస్‌ఇఎఫ్‌ (శంకర ఐ ఫౌండేషన్‌) 
స్పందన సంస్థ 
తానా (తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా)
టిసిఎ (తెలంగాణ కల్చరల్‌ అసోసియేషన్‌)
టిడిఎఫ్‌ (తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరమ్‌) 
యునైటెడ్‌ ఫిజీ అసోసియేషన్‌ 
యుపిఎంఎ (ఉత్తర ప్రదేశ్‌ మండలం)
వేద టెంపుల్‌ 
విపిఎ (వొక్కలిగ పరిషత్‌ ఆఫ్‌ అమెరికా) 
విటి సేవ
ఈస్ట్‌ బే మ్యూజికల్‌ గ్రూప్‌ (EBK)

 

Click here for Event Gallery

 

 

Tags :