Radha Spaces ASBL

రివ్యూ : 'ఏజెంట్' అఖిల్ టార్గెట్ మిస్ అయ్యాడు!

రివ్యూ : 'ఏజెంట్' అఖిల్ టార్గెట్ మిస్ అయ్యాడు!

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5
నిర్మాణ సంస్థ : ఏకే ఎంటర్టైన్మెంట్స్
నటీనటులు: అఖిల్ అక్కినేని, మమ్ముట్టి,  డినో మోరియా , సాక్షి వైద్య,  పోసాని కృష్ణ మురళి,
మురళీ శర్మ, వరలక్ష్మి శరత్ కుమార్, భరత్ రెడ్డి తదితరులు నటించారు.
సంగీత దర్శకులు: హిప్ హాప్ తమిజా, సినిమాటోగ్రఫీ : రసూల్ ఎల్లోర్
ఎడిటర్ : నవీన్ నూలి
నిర్మాతలు : రామ్ బ్రహ్మం సుంకర, అజయ్ సుంకర, పతి దీపా రెడ్డి  
దర్శకులు : సురేందర్ రెడ్డి
విడుదల తేదీ : 28. 04. 2023

అక్కినేని ఫ్యామిలీ హీరో అఖిల్ కి 'మనం' చిత్రంలో వచ్చిన క్రెజ్ అంతా ఇంతా కాదు. అయితే మాస్ హీరోగా నిలదొక్కుకోవటానికి అఖిల్ చిత్రం నుండి  ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చాలా రోజులుగా గట్టి ప్రయత్నమే చేశారు. మనం తరువాత సోలో హీరోగా తన కెరీర్‌లో ఒకే ఒక  హిట్ మూవీగా నిలిచి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ మూవీ తనకు క్లాస్ హిట్ మూవీగానే నిలిచింది. అయితే అఖిల్ మాత్రం మాస్ హీరోగా ప్రూవ్ చేసుకోవటానికి చాలా కష్టపడుతున్నారు.  అందులో భాగంగా అఖిల్ గత ఏడాదిగా చేస్తున్న సినిమా  ‘ఏజెంట్’. స్పై థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో రూూపొందిన ఈ చిత్రం కోసం అఖిల్ చాలానే కష్టపడ్డాడు. సిక్స్ ప్యాక్‌ చేసి బీస్ట్ లుక్‌లోకి మారాడు. స్టైలిష్ టేకింగ్ డైరెక్టర్‌గా పేరున్న సురేందర్ రెడ్డి, మలయాళ సూపర్ స్టార్ మామ్మూటీ తో చేయి కలిపారు అఖిల్. ఏజెంట్ సినిమా పూర్తయ్యే వరకు తను మరో సినిమా చేయటానికి కూడా ఇష్టపడలేదు. దానికి తగ్గట్టు ఏజెంట్ సినిమా టీజర్, ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను మరింతగా పెంచాయి. మరి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా? అఖిల్‌కి మాస్ హీరోగా స్థానం  దక్కిందా? లేదా అని తెలుసుకోవాలంటే రివ్యూ చూద్దాం.

కథ :

మహదేవ్ (మమ్ముట్టి) రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ (RAW)కు హెడ్‌గా పనిచేస్తుంటాడు. దేశ భద్రత కోసం ప్రాణాలను సైతం త్యాగం చేయాలని ఎప్పుడూ చెబుతుంటాడు. దేశ రక్షణ కోసం ఏజెంట్స్‌ను చనిపోవాలని కూడా చెబుతుంటాడు. అలాంటి వ్యక్తికి పెద్ద సమస్యగా మారుతాడు గాడ్(డినో మోరియా). ఇండియాను నాశనం చేయటానికి తను సూపర్ ప్లాన్ ఒకటి తయారు చేస్తాడు. దాన్ని విదేశీయలకు అమ్మేయాలనేది తన ప్లాన్. గాడ్‌ను పట్టుకోవటానికి మహదేవ్ తన ఏజెంట్స్‌తో గట్టి ప్రయత్నాలే చేస్తుంటాడు. కానీ గాడ్ చిక్కినట్లే చిక్కి తప్పించుకుంటుంటాడు. రిక్కీ అలియాస్ రామకృష్ణ (అఖిల్) తాను ఓ పవర్ ఫుల్ ‘రా’ ఏజెంట్ కావాలని చిన్నప్పటి నుంచి కల కంటూ.. రా కోసమే బతుకుతూ ఉంటాడు.  తను చాలా టాలెంటెండ్ కానీ.. ప్రొఫెషనల్‌గా లేకపోవటం, ఓవర్ యాక్టివ్‌గా ఉండటం వంటి కారణాలతో రా అధికారులు అతన్ని మూడు సార్లు ఇంటర్వ్యూల్లో రిజెక్ట్ చేస్తారు. మహదేవ్‌ను అమితంగా ప్రేమించే రెక్కి.. తనకు దగ్గర కావటానికి ఏకంగా రా టెక్నాలజీని హ్యక్ చేస్తాడు. కానీ ప్రొఫెషనల్‌గా లేవని, నీలాంటి వాడు రా లో పని చేయలేడని చెప్పి అతన్ని దూరం పెడుతుంటాడు. కానీ ఓ సందర్భంలో రెక్కికి మహాదేవ్ గాడ్‌ను పట్టుకునే ఆపరేషన్ అప్పగిస్తాడు. అప్పుడు రెక్కి ఏం చేస్తాడు? మహదేవ్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడా? గాడ్‌ను పట్టుకుంటాడా? ఈ ఆపరేషన్‌లో ఇటు మహదేవ్, అటు రెక్కి మానసికంగా ఎదుర్కొనే పరిస్థితులేంటి? రెక్కి ప్రేమించిన అమ్మాయి (సాక్షి వైద్య)ను ఎందుకు వదులుకుంటాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల హావభావాలు:

ఈ చిత్రానికి అక్కినేని అఖిల్ పడ్డ కష్టం మామూలుగా లేదు. యాక్షన్ సన్నివేశాల కోసం తన లుక్ మొత్తాన్ని మార్చుకున్నాడు. సిక్స్ ప్యాక్స్‌తో ఫ్యాన్స్‌కే కాదు.. ప్రేక్షకులకు కూడా తెలియని కిక్ ఇచ్చాడు. తను హీరోగా చేయాల్సిన దాని కంటే ఎక్కువగా హార్డ్ వర్క్ చేశారనేది తెరపై చూస్తే తెలుస్తుంది. పెద్దగా ఆస్కారం పాత్ర హీరోయిన్ సాక్షి వైద్య, కేవలం  పాటలకే పరిమితం అయ్యింది. ఇక సినిమాలో మరో ప్రధాన పాత్రలో నటించిన మమ్ముట్టి పాత్రకు మంచి స్కోప్ ఉంది. రా హెడ్‌గా దేశం ప్రాణ త్యాగం చేసే దేశ భక్తుడిగా ఆయన పాత్రను చూపించారు. ఆయన తనదైన నటనతో మెప్పించాడు. డినో మోరియా చేసిన గాడ్ అనే విలన్‌ పాత్రకు ఇచ్చిన ఎలివేషన్‌కి రాను రాను ఆ పాత్రను చూపించిన తీరుకి అస్సలు సంబంధమే కనపడదు. పోసాని కృష్ణ మురళి, మురళీ శర్మ, వరలక్ష్మి శరత్ కుమార్, భరత్ రెడ్డి పాత్రలు అలా వచ్చి వెళ్లిపోతుంటాయి. భారీ క్యాస్ట్‌నే వాడారు. మూడు నాలుగు పాత్రలకు మినహా మిగిలిన వాటిని ప్రాధాన్యత ఉండదు.

సాంకేతిక వర్గం పనితీరు:

దర్శకుడు సురేందర్ పేరుకు తగ్గట్టు సినిమాను స్టైలిష్‌గా తెరకెక్కించాడు. దానికి తగ్గటు బడ్జెట్ కూడా భారీగానే పెట్టారు. కానీ ప్రధాన సమస్య కథ, కథనం. సినిమా ఎక్కడో స్టార్ట్ అయ్యి.. ఎలాగో వెళుతుంటుంది. యాక్షన్ మరి ఎక్కువైంది. పోనీ ఏమైనా గూజ్ బమ్స్ వచ్చేలా ఉన్నాయా అంటే బోరింగ్‌గా అనిపిస్తాయి. అతని ఐడియాకు తగ్గట్టు అంతే కొత్తగా ట్రీట్మెంట్ ను మాత్రం రాసుకోలేదు. సినిమాలో సప్సెన్స్ తో ఇంట్రెస్ట్ పెంచే స్కోప్ ఉన్నప్పటికీ ప్లే సింపుల్ గా హ్యాండల్ చేశారు. మ్యూజిక్ విష‌యానికి వ‌స్తే…హిప్ హాప్ తమిజా అందించిన సంగీతం అక్కడక్కడ పర్వాలేదనిపిస్తోంది. సినిమాటోగ్రఫీ విషయం  రసూల్ ఎల్లోర్  పనితనం సినిమాని నిలపెట్టింది. సినిమా మూడ్ కి అనుగుణంగా రసూల్ దృశ్యాలని బాగా తెరకెక్కించారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాగున్నప్పటికీ కథకు అవసరం లేని సీన్స్ ను ట్రీమ్ చేసి ఉంటే బాగుండేది. ప్రొడ్యూసర్ గా  ఏకే ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.

విశ్లేషణ:

అక్కినేని అఖిల్ అభిమానులు చాలా రోజుల నుంచి తమ హీరోని మాస్, యాక్షన్ కోణంలో చూడాలని కలలు కన్నారు. వారి కోసమే చేస్తున్నట్లు ఏజెంట్ సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందించారు. స్పై థ్రిల్లర్ కావటంతో యాక్షన్ ఎపిసోడ్స్‌ను భారీగానే ప్లాన్ చేశారు. మన దేశంతో పాటు విదేశాల్లోనూ ప్లాన్ చేసి తెరకెక్కించారు. ఈ సినిమాలో కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ మరియు అఖిల్ వైల్డ్ పెర్ఫార్మెన్స్ బాగున్నాయి. అలాగే మమ్ముట్టి నటన మెప్పిస్తుంది. అయితే, బోరింగ్ స్క్రీన్  ప్లేతో పాటు లాజిక్ లెస్ సీన్స్, ఇంట్రెస్ట్ కలిగించలేని యాక్షన్ డ్రామా సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ అక్కినేని అభిమానులకు మాత్రమే నచ్చోచ్చు. కానీ మిగిలిన వర్గాల ప్రేక్షకులకు ఈ ఫైరింగ్ సినిమా కనెక్ట్ కాదు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :