'భలే ఉన్నాడే'లో స్ట్రాంగ్ విమెన్ క్యారెక్టర్ చేశాను : అభిరామి
యంగ్ హీరో రాజ్ తరుణ్ న్యూ ఏజ్ ఎంటర్ టైనర్ 'భలే ఉన్నాడే'. రవికిరణ్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్‌వి కిరణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జె శివసాయి వర్ధన్ డైరెక్టర్. బ్లాక్ బస్టర్ మేకర్ మారుతి ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నారు. మనీషా కంద్కూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ అభిరామి కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ టీజర్, ట్రైలర్ సాంగ్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ 13న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా యాక్ట్రెస్ అభిరామి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.
వెరీ బిగినింగ్ నుంచి ఇప్పటివరకూ మీ జర్నీ గురించి చెప్పాలంటే ?
-రెండు పదాలలో చెప్పాలంటే.. హ్యాపీ యాక్సిడెంట్ (నవ్వుతూ). నేను ఏదీ ప్లాన్ చేసిన రాలేదు. ఎలాంటి సినీ నేపధ్యం లేదు. అమ్మ నాన్న బ్యాంక్ ఉద్యోగులు. మిడిల్ క్లాస్ అమ్మాయిని. టీవీలో యాంకర్ గా చేశాను. తర్వాత ఫిల్మ్ ఆఫర్స్ వచ్చాయి. కొన్ని సినిమాలు చేశాను. తర్వాత యుఎస్ వెళ్లి చదువుకున్నాను. పెళ్లి చేసుకొని అక్కడే కొన్నాళ్ళు సెటిల్ అయ్యాను. తిరిగిరావడంలో కూడా ప్లాన్ లేదు. ఇదొక వండర్ ఫుల్ జర్నీ. నచ్చిన వృత్తిలో వున్నాను. నేను చాలా లక్కీ.
'భలే ఉన్నాడే' మూవీలోకి ఎలా వచ్చారు ?
-మారుతి గారు కాల్ చేసిన ఈ సినిమా, క్యారెక్టర్ గురించి చెప్పారు. తర్వాత డైరెక్టర్ శివసాయి వర్ధన్ కథ, క్యారెక్టర్ చెప్పినపుడు చాలా నచ్చింది. ఇమ్మిడియట్ గా చేయాలని డిసైడ్ అయ్యాను.
మీ క్యారెక్టర్ ఎలా వుండబోతోంది ?
-ఇందులో నా క్యారెక్టర్ పేరు గౌరీ. తను బ్యాంక్ ఎంప్లాయ్. అమ్మనాన్న బ్యాంక్ ఉద్యోగులే కావడంతో ఇది నాకు పర్శనల్ గా కనెక్ట్ అయ్యే క్యారెక్టర్. సింగిల్ మదర్, స్ట్రాంగ్ ప్రిన్సిపల్ వున్న విమెన్ క్యారెక్టర్ నాది. డైరెక్టర్ గారు మదర్ తో పాటు ఒక సిస్టర్ లా కనిపించేలా క్యారెక్టర్ ని తీర్చిదిద్దారు.
-గౌరీ స్ట్రాంగ్ విమెన్. తనలో సీరియస్ నెస్ తో పాటు హ్యుమర్, ఎమోషన్ వుంటుంది. సినిమా త్రూ అవుట్ నా క్యారెక్టర్ వుంటుంది. మదర్- సన్ రిలేషన్షిప్ సినిమాకి సోల్ గా వుంటుంది. ఈ సినిమాకి నా క్యారెక్టర్ ఎమోషనల్ యాంకర్ లా వుంటుంది. అలాగే ఈ సినిమాలో సింగీతం గారు, లీలా గారి పాత్రల మధ్య నడిచే కథ కూడా బ్యూటీఫుల్ గా వుంటుంది,
డైరెక్టర్ శివసాయి వర్ధన్ గురించి?
-శివసాయి వర్ధన్ ఫస్ట్ టైం డైరెక్టర్ లా అనిపించలేదు. తనకు చాలా క్లారిటీ వుంది. క్లియర్ విజన్ తో వుంటారు. సినిమాకి ఎంతకావాలో ఏమి కావాలో తెలుసు. చాలా ఫ్లెక్స్ బుల్ గా వుంటారు. సినిమాకి యూజ్ అయ్యే ఏదైనా సజెషన్ ఇస్తే తీసుకుంటారు.
మూవీ ప్రొడ్యూసర్స్ గురించి ?
-నిర్మాతలు చాలా కంఫర్ట్ బుల్ గా చూసుకున్నారు. వారితో వర్క్ చేయడం మంచి ఎక్స్ పీరియన్స్.
-మారుతిగారు గ్రేట్ ప్రొడ్యూసర్, డైరెక్టర్. తనకి ఎలాంటి కథని ఎంచుకోవాలో అన్నీ తెలుసు.
యాక్టింగ్ విషయంలో రాజ్ తరుణ్ కి ఏమైనా సజెషన్స్ ఇచ్చారా?
-రాజ్ తరుణ్ గుడ్ యాక్టర్. సజెషన్స్ అంటూ ప్రత్యేకంగా ఏమీ ఇవ్వలేదు. ఇందులో తనది శారీ డ్రాపర్ క్యారెక్టర్. శారీని ఎలా టై చేస్తారో కొంచెం గైడ్ చేశాను.
మీ రీఎంట్రీలో మహారాజ, సరిపోదా శనివారం లాంటి సూపర్ హిట్స్ చేశారు. 'భలే ఉన్నాడే'లో మిమ్మల్ని ఆకట్టుకున్న ఎలిమెంట్స్ ఏమిటి?
-నిజానికి నేను ఒప్పుకున్న మొదటి సినిమా ఇదే. తర్వాత మహారాజా, సరిపోదా శనివారం వచ్చాయి. ఆ రెండు ముందుగా రిలీజ్ అయ్యాయి. నేను ఎప్పుడూ కథనే చూస్తాను. మహారాజ, సరిపోదా శనివారం ఎలా అయితే కథ నచ్చి చేశానో.. 'భలే ఉన్నాడే' చేయడానికి కారణం కూడా కథే. నాకు కథ, క్యారెక్టర్ నచ్చితే మరో ఆలోచన లేకుండా చేస్తాను.
చెప్పవే చిరుగాలి తర్వాత మళ్ళీ తెలుగులో సినిమాలు చేయకపోవడానికి కారణం?
-నేను ఆ సినిమా సమయంలోనే డిగ్రీ చేయడానికి యుఎస్ వెళ్లాను. ఆ సినిమాని చాలా రోజుల తర్వాత చూశాను. సినిమా చాలా మంచి విజయం సాధించింది. తర్వాత కొన్ని ఆఫర్స్ వచ్చాయి. నేను యుఎస్ లో వుండిపోవడం వలన చేయడం కుదరలేదు.
మీ రీఎంట్రీ ఎలా జరిగింది ?
-పదేళ్ళ క్రితం తమిళ్ లో నా రీఎంట్రీ జరిగింది. కమల్ హసన్ గారి విశ్వరూపం సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కి డబ్బింగ్ చెప్పడానికి యూఎస్ నుంచి వచ్చాను. అప్పటినుంచి చాలా మంది క్యారెక్టర్స్ కోసం అప్రోచ్ అయ్యారు. నేను మాత్రం సెలక్టివ్ గా చేస్తున్నాను. గత రెండేళ్ళలో పది సినిమాలు చేశాను. ఇప్పుడు ఇండియాలోనే వున్నాను.
కొత్తగా చేస్తున్న సినిమాలు ?
-రెండు తెలుగు కథలు విన్నాను. తర్వాతలోనే వాటి గురించి చెప్తాను.
-ఇంట్రస్టింగ్ రోల్స్ చేయాలని వుంది. తమిళ్ లో లీడ్ రోల్ లో రెండు సినిమాలు చేస్తున్నాను.
-కమల్ హసన్, మణిరత్నం గారి సినిమాని ఇటివలే నా పోర్షన్ పూర్తి చేశాను. ఇంకొన్ని ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్స్ వున్నాయి.