కుప్పం పోటీ పై హీరో విశాల్.. సంచలన ప్రకటన

కుప్పం పోటీ పై హీరో విశాల్.. సంచలన ప్రకటన

సినీ హీరో విశాల్‌ సంచలన ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నుంచి తాను పోటీ చేస్తున్నట్లు వస్తున్న వార్తలను విశాల్‌ కొట్టిపారేశాడు. ఇటువంటి ప్రచారాలను నమ్మవద్దని కోరారు. అసలు పోటీ విషయమే తనకు తెలియదని, ఎవరూ తనని సంప్రదించలేదని విశాల్‌ ప్రకటించారు. ఈ వార్తలు ఎలా వచ్చాయో తనకు అర్థం కావడం లేదని పేర్కొన్నారు. తాను సినిమాలు చేసుకుంటున్నానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ప్రవేశించాలని కానీ, చంద్రబాబుపై పోటీ చేయాలని నతకు ఎటువంటి ఆలోచనా లేదని విశాల్‌ పేర్కొన్నారు.

 

Tags :