Radha Spaces ASBL

'శాసనసభ' చిత్రం నటుడిగానాకు గుర్తింపు తెస్తుంది : భూషణ్

'శాసనసభ' చిత్రం నటుడిగానాకు గుర్తింపు తెస్తుంది : భూషణ్

రక్తకన్నీరు నాగభూషణం మనవడు, దర్శకుడు మీర్ తనయుడు అబీద్ భూషణ్ నటిస్తున్న తాజా చిత్రం శాసనసభ. ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో ఇంద్రసేన కథానాయకుడు.  భూషణ్ ఈ చిత్రంలో ఓ కీలకపాత్రలో కనిపించబోతున్నాడు. ఈ నెల 16న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా భూషణ్ మాట్లాడుతూ  పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు వైఎస్‌ఆర్‌కు  దగ్గరగా వున్న పాత్రలో కనిపించబోతున్నాను. ఆయన ఇన్‌స్పిరేషన్‌తో శాసనసభలో నేను ఈ గొప్ప పాత్రను పోషించాను. ఎన్నికల సమయంలో ఆయన ప్రజలతో కలిసిపోయిన విధానం, ఆయనలోని లీడర్‌షిప్ క్వాలిటీస్ నా పాత్రకు ప్రేరణ ఇచ్చాయి. తప్పకుండా ఈ చిత్రం నాకు నటుడిగా మంచి పేరును తెస్తుందనే నమ్మకం వుంది. దీంతో పాటు నేను ప్రధాన పాత్రలో నటిస్తున్న ్రైస్టెకర్ అనే చిత్రం రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తిచేసుకుంది. మరికొన్ని చిత్రాలు చర్చల దశలో వున్నాయి అని తెలిపారు. 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :