పంజాబ్ ఆప్ సీఎం అభ్యర్థిని ప్రకటించిన కేజ్రీవాల్

పంజాబ్ ఆప్ సీఎం అభ్యర్థిని ప్రకటించిన కేజ్రీవాల్

పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపీ భగవంత్‌ మాన్‌ పేరును ఖరారు చేశారు. ఈ మేరకు ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. సీఎం అభ్యర్థి ఎంపిక కోసం ఆప్‌ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. సీఎం అభ్యర్థి కోసం ప్రజలతో టెలీఓటింగ్‌ నిర్వహించింది. ఇందులో 93 శాతం మంది భగవంత్‌ మాన్‌నే సీఎం అభ్యర్థిగా ఎన్నుకున్నట్లు కేజ్రీవాల్‌ వెల్లడిరచారు.

భగవంత్‌ మాన్‌ ప్రస్తుతం పంజాబ్‌ ఆప్‌ శాఖ అధ్యక్షుడిగా ఉన్నారు. సంగ్రూర్‌ నుంచి లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. సీఎం అభ్యర్థిగా ప్రకటించగానే భగవంత్‌ ఒకింత బావోద్వేగానికి గురయ్యారు. ఒకప్పుడు కమెడియన్‌గా ప్రజలు నన్ను చూసి నవ్వేవారు. ఇప్పుడు అదే ప్రజలు ఏడుస్తూ తమను కాపాడమని వేడుకొంటున్నారు అని మాన్‌ చెప్పుకొచ్చారు. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ఫిబ్రవరి 20న జరగనుండా, మార్చి 10వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

 

Tags :