వాషింగ్టన్ డీసీలో స్పీకర్ అయ్యన్నపాత్రుడికి ఘనస్వాగతం
గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో జరిగే గోల్డెన్ జూబ్లి వేడుకలకోసం వాషింగ్టన్ డీసి వచ్చిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడుకు ఘనస్వాగతం లభించింది. తానా మాజీ ప్రెసిడెంట్లు, ఎన్నారై టీడిపి నాయకులు జయరాంకోమటి, సతీష్ వేమన తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దేశ విదేశాల్లో ఉన్నా కూడా తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతున్నారని అయ్యన్నపాత్రులు ప్రశంసించారు. డిట్రాయిట్‌కు చెందిన సునీల్ పంట్ర, కిరణ్ చౌదరి తదితరులు కూడా స్పీకర్ అయ్యన్నపాత్రుడును కలిసి స్వాగతించారు.
Tags :