న్యూజెర్సీలో వెనిగండ్ల రాముకు ఘన సత్కారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కూటమి ప్రభుత్వ విజయంలో ఎన్నారై లు కీలక పాత్ర వహించారని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గుడివాడ ఎమ్మెల్యే గా ఘన విజయం సాధించిన వెనిగండ్ల రాము ను న్యూజెర్సీలోని ఎన్నారైలు ఆత్మీయ అభినందన సభలో ఘనంగా సత్కరించారు. మోన్మౌత్ జంక్షన్ లోని ఎంబెర్ బాంకెట్స్ లో న్యూ జెర్సీ కూటమి ఆధ్వర్యంలో జరిగిన ఈ అభినందన సభలో సుమారు నాలుగు వందలమందికి పైగా ఎన్నారైలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ అంటూ పలువురు నినాదాలు చేశారు. అనంతరం గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ ఎన్నారైలు గుడివాడ ప్రాంతంలో పరిశ్రమలు స్థాపించుటకు అనువుగా ఉంటుందని, ఏపీ లో పెట్టుబడులు పెట్టి గుడివాడ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు కూటమి ప్రభుత్వం అవసరమైన సహాయం చేస్తోందని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నారైలు ఈ సారి ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం ఎనలేని కృషి చేసారని కొనియాడారు.
ఎన్నారైల కృషి ఎంత చెప్పిన తక్కువ అని వారికి నా ప్రత్యేక అభినందనలు తెలపాలని గౌరవనీయులు చంద్ర బాబు నాయుడు గారు తెలిపారు అని రాము ఈ సందర్భంగా తెలిపారు
ఈ కార్యక్రమంలో విద్యాధర్ గారపాటి , శ్రీహరి మందాడి, సమతా కోగంటి, హరి ముత్యాల, రాధా నల్లమల్ల, జగదీశ్ యలమంచలి, రాజా కసుకుర్తి తదితరులు ఎన్నికల సంగ్రామంలో తమ అనుభవాలని పంచుకున్నారు
కార్యక్రమంలో తానా తాజా మాజీ అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి, తెలంగాణ తెలుగుదేశం ఉపాధ్యక్షలు టి జి కె మూర్తి, సాయి కృష్ణ బొబ్బా, శ్రీనివాస్ ఓరుగంటి, సతీష్ మేకా, న్యూ జెర్సీ తెలుగుదేశం, జనసేన, భాజపా ప్రతినిధులు పాల్గొన్నారు.