పేదరికంలేని సమాజం కోసం కృషి

mepma book released by chandrababu

 పేదరికం లేని సమాజం కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రతి కుటుంబానికి నెలకు రూ.10వేల ఆదాయం కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. చిత్తుకాగితాలు ఏరుకునే వీధి బాలల విద్య, ఆరోగ్యం, సాధికారిత, గౌరవప్రద వృత్తులతో జీవనవిధానం అనే అంశాలపై పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) రూపొందించి ముద్రించిన పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ, స్వచ్ఛాంధ్ర మిషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ సీఎల్‌ వెంకటరావు, సీఎం ముఖ్య కార్యదర్శి సతీష్‌చంద్ర, పురపాలక ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్‌, మెప్పా డైరెక్టర్‌ చిన్నతాతయ్య పాల్గొన్నారు.