నంద్యాల ఉప ఎన్నికల్లో మేమే పోటీచేస్తాం

Bhuma Family Vs Shilpa Family For Nandyal By Election

కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల్లో  తమ కుటుంబం నుంచే పోటీ చేస్తారని మంత్రి  భూమా అఖిల ప్రియ సృష్టం చేశారు.  విజయవాడలోని భవానీ ఐల్యాండ్‌ను మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ  ఈ నెల 24న తన తల్లి శోభానాగిరెడ్డి వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తామని, ఆ రోజున అభ్యర్థి వివరాలను ప్రకటిస్తామని చెప్పారు. ఐల్యాండ్‌లో ఫైవ్‌స్టార్‌ హోటళ్లతో పాటు మరిన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు.