ఇవాంకాపై డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రశంసలు

Donald Trump praises daughter for promoting women entrepreneurs in India

అంతర్జాతీయ వ్యాపారవేత్తల సదస్సులో పాల్గొన్న ఇవాంకా ట్రంప్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రశంసలు కురిపించారు. చాలా గొప్ప పని చేశావంటూ తన సలహాదారు, కూతురు అయిన ఇవాంకాను డొనాల్డ్‌ ట్రంప్‌ మెచ్చుకున్నారు. గ్రేట్‌వర్క్‌ ఇవాంకా అంటూ ఆయన ఓ ట్వీట్‌ చేశారు. జీఈఎస్‌ మొదటి రోజు సదస్సుకు వచ్చిన ప్రతినిధులు ఉద్దేశించి ఇవాంకా మాట్లాడారు. మహిళలు తన భవిష్యత్తును తీర్చిదిద్దుకునే విధంగా తమ ప్రభుత్వం విధానాలను రూపొందిస్తున్నదని ఇవాంక ఆ ప్రసంగంలో పేర్కొన్నారు. వర్క్‌ఫోర్స్‌, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం అమెరికా ప్రభుత్వం అనేక విధానాలు అమలు చేస్తున్నదని అన్నారు. తమ కలలను తమ భవిష్యత్తుగా మార్చుకునేందుకు మహిళా వ్యాపారవేత్తలకు సహాకారం అందిస్తున్నామని ఇవాంకా ఆ ప్రసంగంలో తెలిపారు.

 


                    Advertise with us !!!