నిమిషానికి కోటి.. అది ఆయన రేంజ్

Pawan Kalyan screen time was fifty minutes in Vakeel Saab

రాజకీయ ప్రవేశం చేసిన తర్వాత దాదాపు మూడేళ్ల గ్యాప్ తో వకీల్ సాబ్ సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు ఓ మై ఫ్రెండ్ ఫేమ్ వేణు శ్రీ రామ్ దర్శకత్వం వహించాడు. చాలా రోజుల తర్వాత పవన్ ని వెండి తెరపై చూస్తున్నామన్న ఆసక్తి ఉన్న ఫ్యాన్స్ అందరికీ మరో రెండు రోజుల్లో వకీల్ సాబ్ దర్శనమివ్వనున్నాడు.

ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 9న రిలీజ్ కానున్న ఈ సినిమా ట్రైలర్ తో సినిమా మీద అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దానికి తోడు సినిమాను భారీ రేంజ్ లో రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. పింక్ రీమేక్ గా రూపొందిన వకీల్ సాబ్ లో పవన్ ను ఉద్ధేశించి చాలా మార్పులు చేశారు. 155 నిమిషాల రన్ టైమ్ తో  సెన్సార్ పూర్తి చేసుకుని యుఎ సర్టిఫికేట్ పొందింది.

ఇదిలా ఉంటే వకీల్ సాబ్ సినిమాలో పవన్ స్క్రీన్ స్పేస్ దాదాపు 50 నిమిషాలు ఉండనుందట. పింక్ లో అమితాబ్ క్యారెక్టర్ రన్ టైమ్ అయితే చాలా తక్కువ. కేవలం కోర్టు సీన్స్ లో మాత్రమే ఆయన దర్శనమిస్తారు. కానీ తెలుగు కథలో చాలా మార్పులు చేసి, ఫ్లాష్ బ్యాక్, లవ్ ట్రాక్ యాడ్ చేయడంతో సినిమా రెండు గంటల 35 నిమిషాలకు పెరిగింది. ఇందులో 50 నిమిషాల వరకు పవన్ క్యారెక్టర్ కనిపిస్తుందని, మిగతా టైమ్ మొత్తం నివేద, అంజలి, అనన్య లు కనిపించనున్నారని తెలుస్తుంది. అయితే 50 నిమిషాల స్క్రీన్ స్పేస్ కు పవన్ దాదాపు 50 కోట్ల వరకు పుచ్చుకున్నాడని తెలుస్తుంది. ఇదే నిజమైతే పవన్ నిమిషానికి కోటి తీసుకున్న హీరోగా రికార్డ్ క్రియేట్ చేశాడనే చెప్పాలి.