ఎన్టీఆర్30... త్రివిక్రమ్ తోనా..? కొరటాల తోనా..?

NTR30 movie with koratala or tivikram

అరవింద సమేత సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించినున్నట్లు వెల్లడించారు. ఆర్ఆర్ఆర్ షూటింగ్ అయిపోయిన వెంటనే వీరి కాంబినేషన్ లో సినిమాను మొదలుపెడతారని అందరూ అనుకున్నారు. గత రెండ్రోజులుగా ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా ఆగిపోయిందంటూ వార్తలొస్తున్నాయి. అంతేకాకుండా తారక్ తదుపరి సినిమా కొరటాల శివ డైరక్షన్ లో చేయనున్నారనే టాక్ గట్టిగా ఉంది.

ప్రస్తుతం మెగాస్టార్ తో ఆచార్య సినిమా లో బిజీగా ఉన్నాడు కొరటాల శివ. కుదిరినంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేసి, తనకున్న కమిట్ మెంట్స్ ను మొదలు పెట్టాలని చూస్తున్నాడు. ఆచార్య తర్వాత కొరటాల, బన్నీతో సినిమా చేయాల్సి ఉంది. అయితే ఆగస్టు లో రావాలని చూసిన పుష్ప కరోనా నేపథ్యంలో లేటయ్యే ఛాన్స్ లు ఉండటంతో కొరటాల, బన్నీ కాంబో లో సినిమా ఇప్పట్లో మొదలయ్యే అవకాశాలుండకపోవచ్చంటున్నారు. దీంతో కొరటాల ఆచార్య తర్వాత కొన్ని నెలల పాటు బన్నీ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అందుకే వీటన్నింటినీ మైండ్ లో పెట్టుకుని ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా ఎలాగూ ఆగిపోయింది కాబట్టి ఎన్టీఆర్, కొరటాలను లైన్ లో పెట్టాడని తెలుస్తుంది.  

అయితే ఈసినిమా ను ఎన్టీఆర్ ఆర్ట్స్, కొరటాల శివ ఫ్రెండ్ కలిసి నిర్మించనున్నారట. దీని తర్వాతే బన్నీ, కొరటాల శివ కాంబోలో సినిమా రానుందంటున్నారు. ఇదే నిజమైతే, ఎప్పటినుంచో అనుకుంటున్న మహేష్, త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశాలెక్కువగా కనిపిస్తున్నాయి. కాకాపోతే ఇవన్నీ ఎన్టీఆర్30 తోనే ముడిపడున్నాయి కాబట్టి ఈ సినిమా గురించి హారికా హాసినీ వారు ఎంత త్వరగా క్లారిటీ ఇస్తే  అంత మంచిది.