రాధిక దంపతులకు షాక్.. ఏడాది జైలు శిక్ష

Radhika Sarath Kumar Sentenced To One Year In Jail

తమిళ నటుడు, రాజకీయ నాయకుడు శరత్‍కుమార్‍, అతడి భార్య, నటి, నిర్మాత రాధికలకు కోర్టులో చుక్కెదురైంది. చెక్‍ బౌన్స్ కేసులో ఈ దంపతులకు జైలు శిక్ష విధిస్తూ చెన్నై స్పెషల్‍ కోర్టు తీర్పు వెలువరించింది. శరత్‍కుమార్‍, రాధిక, లిస్టిన్‍ స్టీఫెన్‍ సంయుక్తంగా గతంలో సినిమాలు నిర్మించేవాళ్లు. ఈ క్రమంలోనే రేడియన్స్ మీడియా ప్రైవేటు లిమిటెడ్‍ సంస్థ నుంచి పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా తీసుకున్నారు. అప్పు చెల్లించేందుకు 2017లో రేడియన్స్ సంస్థకు చెక్‍ అందజేయగా, అది బౌన్స్ అయ్యింది. దీంతో రేడియన్స్ సంస్థ కోర్టును ఆశ్రయించింది. తాజాగా ఆ కేసును విచారించిన కోర్టు రాధిక దంపతులకు జైలు శిక్ష విధిస్తున్నట్లు తాజాగా తీర్పు వెలువరించింది.