కేసీఆర్ కు ఎమ్మెల్యేలు పెద్ద మైనస్ అవుతారా...?

Will MLAs be a big minus for KCR

ఈ మధ్య కాలంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని కొన్ని అంశాల్లో కాస్త ఇబ్బంది పడుతున్నారు అనే మాట వాస్తవం. చాలా మంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో సమర్థవంతంగా ముందుకు వెళ్ళలేక పోతున్నారు. చాలా మంది ఎమ్మెల్యేలకు వర్గ విభేదాలు ఎక్కువగా ఉన్నాయి. పార్టీలో ఉన్న సమస్యలు చాలా మంది ఎమ్మెల్యేలను ఇబ్బంది పెడుతున్నాయి. మంత్రులతో కూడా చాలా మందికి సఖ్యత లేదు అనే భావన ఉంది. ఎమ్మెల్సీలతో కూడా చాలా మంది ఎమ్మెల్యేలకు మంచి సంబంధాలు లేవు.

అయితే 2019 పార్లమెంట్ ఎన్నికల తర్వాత టిఆర్ఎస్ పార్టీలో కొన్ని సమస్యలు తీవ్రంగా వచ్చాయి అనే భావన ఉంది. 2018 ఎన్నికల్లో భారీ విజయం సాధించినా 2019 పార్లమెంట్ ఎన్నికల విషయానికి వచ్చేసరికి నలుగురు ఎంపీలు మాత్రమే భారీ మెజారిటీతో గెలవగా మిగిలిన నలుగురు ఎంపీలు ఇబ్బందిపడుతూ గెలిచారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ నేతలలో ఒక రకమైన ఆందోళన వ్యక్తమైంది. ఆ తర్వాత టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పెద్దగా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం కూడా చేయలేదు. దానికి ప్రధాన కారణం ఏంటి అనేది అర్థం కాకపోయినా సీఎం కేసీఆర్ తీసుకునే నిర్ణయాలు పార్టీని బలంగా ఉంచుతాయి అనే అభిప్రాయం కూడా కొంతమంది వ్యక్తం చేశారు.

ఎనిమిది మంది ఎంపీలు పార్టీలో ఉన్న సరే చాలా మంది ఎంపీల వద్దకు వెళ్లి తమ సమస్యలు చెప్పుకునే ప్రయత్నం చేయకపోవడం కూడా ఆశ్చర్యానికి గురిచేసే అంశం. చాలా మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో వెనుకబడిన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. అయినా సరే ఎంపీలకు సమస్యల గురించి ఒక నివేదిక ఇచ్చి ఈ అంశాన్ని పార్లమెంట్ లో ప్రస్తావించి నియోజకవర్గంలో పలు సమస్యలు పరిష్కరించాలి అని కోరిన పరిస్థితి కూడా లేదు. కనీసం టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం వద్దకు వెళ్లి సమస్యలు చెప్పుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు.

పార్టీ అధిష్టానం సంగతి పక్కన పెడితే ప్రభుత్వంలో ఉన్న మంత్రులతో కూడా ఎమ్మెల్యేలు చెప్పుకునే ప్రయత్నం చేయటంలేదు. 2019 పార్లమెంట్ ఎన్నికల నుంచి ఇదే జరుగుతుంది అనే భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. అయితే భారతీయ జనతా పార్టీ నుంచి నలుగురు ఎంపీలు గెలవడంతో 2019 ఎన్నికల తర్వాత టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సైలెంట్ అయిపోయారు అని... వాళ్లలో ఒక రకమైన భయం నెలకొంది అందుకే చాలామంది మాట్లాడటం లేదని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ పార్టీ నేతలతో చాలా వరకు కూడా సమర్థవంతంగా వ్యవహరిస్తూ పనులు చేయించుకునే పరిస్థితి కూడా ఉంది. టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం బయటకు రావడం లేదు.