చంద్రబాబుకి స్వేచ్చ లేదా పార్టీలో...?

Freedom for Chandrababu or in the party

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లాలి అంటే బలపడే విధంగా రాజకీయం చేయాలి. అంటే చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాల విషయంలో కాస్త సీరియస్ గా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. కానీ చాలా మంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు చంద్రబాబు నాయుడు ఏ అభిప్రాయం చెప్పినా సరే దానికి ఏదో ఒక విధంగా వంక పెడుతూ ఆ నిర్ణయాన్ని ముందుకు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు వైఖరి లో చాలా వరకు కూడా మార్పు వచ్చింది అనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు.

రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్ళాలి అంటే చంద్రబాబు నాయుడు కఠినంగా వ్యవహరించాలి. ఆయన తీసుకునే నిర్ణయాలను ఆయన మాత్రమే తీసుకుని ఏదైనా సలహాలు ఉంటే ఇతర నేతలను అడగటం చేస్తూ కఠిన నిర్ణయాలు తీసుకునే నిర్ణయాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ముందుకు వెళ్ళడం వంటివి చేయాల్సిన అవసరం ఉంది. అయితే తెలుగుదేశం పార్టీలో అలాంటి వాతావరణం చంద్రబాబు నాయుడుకు లేదు అనే భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఇప్పుడు మాత్రం పరిషత్ ఎన్నికల విషయంలో చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయంతో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు అందరూ కూడా ఆయనపై  ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలిట్ బ్యూరో సమావేశంలో చంద్రబాబు నాయుడు పరిషత్ ఎన్నికలు బహిష్కరిద్దాం అనే నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత చాలామంది నేతలు తప్పుపట్టారు. ఆ తర్వాత నిర్ణయాన్ని ప్రకటించిన సందర్భంగా కూడా చాలామంది నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొంతమంది నేతలు బయటకు వచ్చి కార్యకర్తల అభీష్టం మేరకు పోటీ చేయాల్సిన అవసరం ఉందని లేకపోతే పార్టీ ఇబ్బంది పడుతుందని ఆయన అభిప్రాయాలు చెప్పారు.

అయినా సరే చంద్రబాబు నాయుడు వెనక్కు తగ్గలేదు. కొంత మంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయడానికి నెల నిర్ణయం తీసుకున్నారు. అయినా చంద్రబాబు నాయుడు ఎక్కడ కూడా వెనక్కు తగ్గలేదు. చంద్రబాబు నాయుడు నిర్ణయం సరైనది అనే అభిప్రాయం ఇప్పుడు కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత చంద్రబాబు నాయుడు నిర్ణయాన్ని పార్టీ నేతలు కూడా సమర్థించడం మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడు నిర్ణయాన్ని కార్యకర్తలు కూడా ఇప్పుడు అంగీకరించడమే కాకుండా ఆయన తీసుకున్న నిర్ణయం సరైనది కాబట్టి హైకోర్టు అలాంటి తీర్పిచ్చింది అని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం ఎలాంటిదైనా సరే పార్టీని మద్దతు ఉంటే అది కాస్త ఉపయోగపడే విధంగా ఉంటుంది.