
సోషల్ మీడియా విషయంలో ముఖ్యమంత్రి జగన్ ఈ మధ్య కాలంలో కాస్త దృష్టి పెట్టారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. సోషల్ మీడియా విషయంలో ఆయన చూసి చూడనట్టుగా వ్యవహరించడంతో కొంతమంది కాస్త ఇబ్బందికరంగా వ్యవహరించారనే వ్యాఖ్యలు కూడా ఎక్కువగా వినిపించేవి. సోషల్ మీడియా విషయంలో తమ అభిప్రాయాలను చెప్పే ప్రయత్నం చాలా మంది ఎమ్మెల్యేలు చేయడం లేదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. రాజకీయంగా ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లే విధంగా సోషల్ మీడియాను వాడుకోవాలి.
అయితే ఇప్పుడు కొంత మంది ఎమ్మెల్యేలు సోషల్ మీడియా ఖాతాలు కూడా కొనసాగించడం లేదు. 2017 తర్వాత ప్రశాంత్ కిషోర్ నియోజకవర్గాల్లో దృష్టి పెట్టి సోషల్ మీడియా ను బలోపేతం చేశారు. అయితే ఇప్పుడు నియోజకవర్గాల్లో అటువంటి పరిస్థితి కనపడటం లేదు. మంత్రుల నియోజకవర్గాల్లో కూడా సోషల్ మీడియా చాలా దారుణంగా ఉంది అనే భావన కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ అంశాలను చాలా సీరియస్ గా తీసుకుని ముందుకు అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. అందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోషల్ మీడియా విషయంలో కాస్త ఎక్కువ దృష్టి పెట్టినట్లు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
సోషల్ మీడియా విషయంలో జగన్ సీరియస్ గా లేకపోతే మాత్రం సమస్యలు పెరిగే అవకాశం ఉండవచ్చు. అందుకే ఇప్పుడు ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలో ఎంత వరకు సమర్థవంతంగా ఉన్నారు ఏంటి అనే దానిపై ఇపుడు ఆయన పార్టీ నేతల ద్వారా వివరాలు తెలుసుకుంటున్నారని సమాచారం. దాదాపు 75 నియోజకవర్గాల్లో సోషల్ మీడియా పూర్తిగా బలహీనంగా ఉందని సంక్షేమ కార్యక్రమాలను కూడా సోషల్ మీడియాలో ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లడం లేదని ఇక ఎమ్మెల్యేలు కూడా సోషల్ మీడియా మీద దృష్టిపెట్టి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం లేదని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారు.
అందుకే ఇప్పుడు వాళ్ల విషయంలో కాస్త కఠినంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉండవచ్చు అని సమాచారం. ప్రశాంత్ కిషోర్ బృందం కూడా త్వరలో రాష్ట్రంలో అడుగు పెట్టే అవకాశాలు ఉన్నాయని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ప్రశాంత్ కిషోర్ అడుగు పెడితే మాత్రం వైసీపీ ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఏ నిర్ణయమైనా తీసుకునే అవకాశాలు ఉంటాయని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి.