కేసీఆర్ ఆ ఇద్దరు మంత్రులను పక్కన పెడతారా...?

Will KCR put those two ministers aside

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఇటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఏంటనే దానిపై స్పష్టత రావడం లేదు. కొత్త మంత్రులను క్యాబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. కొన్ని శాఖల మంత్రులను కూడా మార్చే అవకాశం ఉంది అనే అభిప్రాయం కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం కొంతమంది విషయంలో సానుకూలంగా కనపడటం లేదు అనే భావన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కొన్ని కొన్ని అంశాలను కాస్త సీరియస్ గా తీసుకోవాల్సి ఉంటుంది.

అయినా కొంతమంది మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదని అవినీతి వ్యవహారాలు కూడా కాస్త ఎక్కువగానే ఉంటున్నాయి అనే  అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అవినీతి వ్యవహారాల విషయంలో సీఎం కేసీఆర్ చెప్పిన సరే మంత్రులు లెక్కచేయడం లేదు అనే భావన కూడా చాలావరకు వ్యక్తమవుతోంది. అందుకే ఇప్పుడు కొంత మంది మంత్రులను పక్కన పెట్టడానికి ఆయన రెడీ అయ్యారు. అయితే మంత్రివర్గంలోకి తీసుకునే విషయంలో యువ ఎమ్మెల్యేలు ఆయన ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు.

కొంతమంది ఎమ్మెల్యేలు విద్యావంతులుగా కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళని క్యాబినెట్ లోకి తీసుకుని ముందుకు నడిపితే బాగుంటుందని... కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు కొంత మంది ఉన్నత విద్యను అభ్యసించారు. కాబట్టి వాళ్లను ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు ఉండవచ్చు. టిఆర్ఎస్ పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు విదేశాల్లో విద్యను అభ్యసించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్లను కూడా క్యాబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉందని సమాచారం. అంతేకాకుండా ఎమ్మెల్సీలు కూడా విషయం ఉన్న వాళ్ళని తీసుకుని ప్రోత్సహిస్తే బాగుంటుంది అనే భావన సీఎం కేసీఆర్ వ్యక్తం చేస్తున్నారు.

అయితే క్యాబినెట్ నుంచి ఎవరిని పంపిస్తారు ఏంటనేది తెలియకపోయినా హైదరాబాద్ నుంచి మల్లారెడ్డి అలాగే కరీంనగర్ జిల్లా నుంచి గంగుల కమలాకర్ ను క్యాబినెట్ నుంచి పంపించే అవకాశం ఉండవచ్చు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గంగుల కమలాకర్ పనితీరు విషయంలో ఎటువంటి ఇబ్బందీ లేకపోయినా కేబినెట్ లో మార్పులు చేర్పుల కోసం ఆయనను పక్కన పెట్టే అవకాశం ఉండవచ్చుననే అభిప్రాయం కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. మల్లారెడ్డి విషయంలో అవినీతి ఆరోపణలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆయన ను పక్కన పెట్టడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. అంతే కాకుండా మరో ముగ్గురు నలుగురు నేతల విషయంలో కూడా సీఎం కేసీఆర్ కాస్త సీరియస్ గా ముందుకు వెళ్లే అవకాశం ఉండవచ్చు అని అంచనా వేస్తున్నారు.