ఆటా ఉగాది సాహిత్య సదస్సు

ATA Ugadi Celebrations 2021

అమెరికా తెలుగు సంఘం (ఆటా) శనివారం ఏప్రిల్ 17, 2021 ఉదయం11:00 AM EST నుండి మధ్యాహ్నం 2.00 PM వరకు ఉగాది సాహిత్య సదస్సు నిర్వహిస్తుంది. ఆటా ఉగాది సాహిత్య సదస్సు కార్యక్రమంలో సుప్రసిద్ధ జ్యోతిష పండితులు పరిశోధకులు డా.శంకరమంచి రామకృష్ణ శాస్త్రి (శృంగేరి శారదాపీఠం ఆస్థాన జ్యోతిష విద్వాంసులు) గారి పంచాంగ శ్రవణం, మహా సహస్రావధాని, ప్రవచన కిరీటి డా.గరికిపాటి నరసింహారావుగారి ప్రసంగం, ప్రముఖ సాహీతీవేత్తలతో ఉగాది కవిసమ్మేళనంలాంటి చక్కటి కార్యక్రమాలు జరుపబోతుంది. ఈ కార్యక్రమము TV5 Channel (Dish Network Channel : 771) అలాగే ఆటా Facebook/ ఆటా https://www.youtube.com/channel/UC8f2pQnzLF4E8FH5xtXnTWg లో ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది.  ఆటా అధ్యక్షులు భువనేశ్ భుజాల కార్యవర్గ బృందం సాహితీ  అభిమానులందరికి ‘ఆటా ఉగాది సాహిత్య సదస్సు’ కార్యక్రమానికి హృదయపూర్వక ఆహ్వానం తెలుపుతున్నారు.