ఏమి పనిచేశారో చెప్పండి...నిరంజన్ శృంగవరపు

Niranjan Srungavarapu Election Campaign in Bay Area

తాము తానాలో వచ్చిన కొద్దికాలంలోనే కమ్యూనిటీకి అవసరమైన ఎన్నో కార్యక్రమాలు చేశామని, అమెరికాతోపాటు, తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమందికి సేవలందించామని, తానాలో పని చేయడానికి పదవులు అవసరం లేదని, చేయాలనే నిబద్ధత చాలని, 20ఏళ్లు ఏదో చేశామని సమయం గురించి బీరాలు పలకడం మాని ఏమి సేవ చేశారో సూటిగా చెప్పాలని తానా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న నిరంజన్‍ శృంగవరపు అన్నారు. కనెక్టికట్‍లో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తమపై విమర్శలు చేసే ముందు మీపై వచ్చిన ఆరోపణలపై సమాధానం ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్యానెల్‍ సభ్యులు పాల్గొన్నారు. తమను గెలిపించి తానాలో మార్పునకు శ్రీకారం చుట్టాలని కోరారు.

బే ఏరియాలో విజయవంతమైన నిరంజన్‍ ప్రచారం

తానా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న నిరంజన్‍ శృంగవరపు, తన ప్యానెల్‍ అభ్యర్థులతో కలిసి బే ఏరియాలో విజయవంతంగా ప్రచారం చేశారు. మార్పు అంటే పారదర్శకంగా ప్రజాస్వామ్యానికి పట్టం కట్టడం తప్ప నాలుగు గోడల మధ్య సీల్డ్ కవర్లో ఎన్నుకోవడం కాదన్నారు. బే-ఏరియాలో తానాకు ఉన్న బలం, ఆ ప్రాంతంతో ఉన్న అనుబంధం అమూల్యమైనదని, రోటీన్‍కు భిన్నంగా పచ్చికబయళ్లల్లో ప్రచారంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. తమ ఓట్లతో తానా ఓటర్లు మార్పు తీర్పుకు పట్టం కట్టాలని కోరారు. అశోక్‍బాబు కొల్లా, సతీష్‍ వేమూరి  యార్లగడ్డ శశాంక్‍, ఓరుగంటి శ్రీనివాస్‍, పురుషోత్తమ చౌదరి, డా.కటికి ఉమ, మురళీ తాళ్ళూరి, రాజా కసుకుర్తి, నిమ్మలపూడి జనార్ధన్‍, లావు అంజయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.