చిరంజీవికి, రామ్ చరణ్ కి ఆ హీరో అంటే ఎంత ప్రేమో? మెగా కుటుంబ సభ్యుడిగా ఆదరిస్తారు

Ram Charan hosts birthday party for Sharwanand

మెగా స్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్  రామ్ చరణ్ తండ్రి కొడులిద్దరూ కూడా ఈ తరంలో సాటీ పోటీ ఎవరూ లేరనిపించుకున్నారు. ఇద్దరు సంస్కారంలో కూడా ఎవరికివారు తీసిపోరు.  తన వారూ పరాయివారూ అన్న తేడా లేకుండా ఎదుటి వారి టాలెంట్ ని మెచ్చుకోవడంలో ఇద్దరూ ముందుంటారు. చిరంజీవి కి హీరో శర్వానంద్ అంటే ఎంతో ఇష్టం కాకపోతే ఖమ్మం లో మార్చ్ 8న జరిగే ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి శర్వానంద్ అడిగిన వెంటనే తప్పక వస్తానని చెప్పడం శర్వానంద్ పై మెగాస్టార్ కి వున్నా ప్రేమానుబంధనికి నిదర్శనం. ఇక  రామ్ చరణ్  కి ఎంతో మంది మిత్రులు ఉన్నారు. పైగా వీరిద్దరూ  చిన్ననాటి స్నేహితులైన శర్వానంద్, రామ్ చరణ్ గత రాత్రి చిల్ అయ్యారు. శర్వానంద్ బర్త్ డే సందర్భంగా రామ్ చరణ్ గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేసి కేక్ కట్ చేయించారు.  వారిలో హీరో శర్వానంద్ అంటే చరణ్ కి చాలా బాగా ఇష్టం.  ఎంత ఇష్టం అంటే చరణ్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా పలుపంచుకుని ఆ మూవీ హిట్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటారు.

ఇక శర్వానంద్ బర్త్ డే వేళ ఏకంగా చరణ్ తానే స్వయంగా పార్టీ ఇచ్చి శర్వానంద్ చేత కేక్ కట్ చేయించడం అంటే ఇది నిజంగా చరణ్ ప్రేమను తెలియచేస్తుంది. చరణ్ మనసులో శర్వానంద్ స్థానం ఎంతో కూడా తెలియచేస్తోంది. దీనికి శర్వానంద్ కూడా చెర్రీకి థాంక్యూ చెప్పాడనుకోండి. ఏది ఏమైనా చరణ్ తాను తెలుగులో మెగా స్టార్, మెగా పవర్ స్టార్ లు అయి ఉండి కూడా యంగ్ హీరోలను బాగా ప్రోత్సహిస్తున్నాడు అని చెప్పాలి. అదే విధంగా ఈ మధ్యన జరిగిన ఉప్పెన సక్సెస్ ఫంక్షన్ కి అటెండ్ అయి వైష్ణవ్ తేజ్ ని కూడా బాగా పొగొడుతూ మంచి కాంప్లిమెంట్ ఇచ్చాడు. మొత్తానికి రామ్ చరణ్  తెలుగులో యంగ్ హీరోలకు మంచి బూస్టింగ్ ఇచ్చే సీనియర్ గా సోదరుడిగా సహచరుడిగా ఉండడం అంటే మెచ్చతగినదే. అదే విధంగా టాలీవుడ్ లో హీరోల మధ్య ఇగోలు లేకుండా అంతా కలసి మెలసి ఉండడం ఆహ్వానించతగినదే. ఇక ఆర్.ఆర్.ఆర్ మూవీలో నటిస్తున్న జూనియర్ ఎన్టీయార్ రామ్ చరణ్ ల మధ్యన కూడా మంచి ఎమోషనల్ బాండేజ్ కుదిరింది. ఈ ఇద్దరూ సొంత అన్నదమ్ముల్లా కలసి మెలసి ఉండడం అందరికీ ముచ్చటగా ఉందంటే సంతోషమేగా మరి.