తొడకొట్టి పవన్ హిట్ కొట్టేనా?

Pawan Kalyan and Krish Movie

హీరోలకు వారి ఫ్యాన్స్ కు కొన్ని సిగ్నేచర్ మూమెంట్స్ ఉంటారు. ఫస్ట్ నుంచి ఏ హీరో నుంచి ఎలాంటి స్పెషల్ మూమెంట్ లైక్ చేస్తారో అలాంటి మూమెంట్ ప్రతి సినిమాలో ఉండేలా ప్లాన్ చేసుకుంటారు ఆయా హీరోలు. ఫ్యాన్స్ కూడా అంతే తమ హీరో నుంచి ఇంకా ఆ డైలాగ్ రాలేదేంటా అని వెయిట్ చేస్తుంటారు.

టాలీవుడ్ లో ప్రతీ ఒక్క హీరోకు ఒక్కో స్పెషల్ మార్క్ ఉంది. విక్టరీ వెంకటేష్ చేయి చూపించి మాట్లాడటం, పవన్ కళ్యాణ్ కాలర్ పై చేయి పెట్టి డైలాగ్ చెప్పడం, బాలయ్య తొడకొట్టి డైలాగ్ చెప్పడం ఇలా ఎవరి స్పెషల్ వారికుంది. ఒక్కో హీరో తమ అభిమానుల కోసం ఒక్కో సిగ్నేచర్ సీన్ సెట్ చేసి పెట్టుకున్నారు. కానీ ఒక్కోసారి వేరే హీరోలు కూడా ఆ మూమెంట్స్ ఫాలో అవుతూ ఉంటారు.

ఇంద్ర లో చిరంజీవి తొడకొట్టి హిట్ కొడితే, సుడిగాడులో అల్లరి నరేష్ తొడకొట్టి హిట్ కొట్టాడు. ఇప్పుడు మళ్లీ ఇంకో హీరో బాలయ్య తొడకొట్టే సీన్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఆ హీరో మరెవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నసినిమాలో తొడకొట్టి డైలాగ్ చెప్పినట్లు టాక్ వినిపిస్తుంది. మార్చి 11 న పవన్, క్రిష్ సినిమాల టీజర్ తో పాటూ టైటిల్ కూడా రివీల్ కానుంది. మరి ఇంతమంది హీరోలు తొడకొట్టి హిట్ కొట్టినట్లే పవన్ కూడా తొడ కొట్టి హిట్ కొడతాడేమో చూడాలి.