పుష్ప లో మసాలా సాంగ్ ఫినిష్ చేసిన సుక్కు

PUSHPA Item Song Completed by Sukumar

రెండేళ్ల గ్యాప్ తర్వాత క్రియేటివ్ డైరక్టర్ సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా పుష్ప. అల్లు అర్జున్, సుకుమార్ కాంబో లో వస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా సినిమా ఇది. దేశ వ్యాప్తంగా పుష్ప తో బన్నీ ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి రోజుకో వార్త బయటకు వస్తుంది.

ఇప్పటికే రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయడంతో షూటింగ్ ను ఫాస్ట్ గా కంప్లీట్ చేసేందుకు భారీ సీక్వెన్స్ ను ప్లాన్ చేశాడట సుకుమార్. రీసెంట్ గానే మారేడుమిల్లి అడవుల్లో భారీ షెడ్యూల్ ను పూర్తి చేశారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. బన్నీ, సుకుమార్ ల కాంబో తెరకెక్కుతున్న ఈ మూడో సినిమా ఇటీవలే తమిళనాడు షెడ్యూల్ కూడా ఫినిష్ చేసుకుందని ఇన్ సైడ్ ఇన్ఫర్మేషన్.

అంతేకాదు ఇదే తమిళనాడు షెడ్యూల్ లో బన్నీ తో మసాలా సాంగ్ కూడా కంప్లీట్ చేశారట. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ సినిమా సాంగ్స్ పై అభిమానులలో భారీ అంచనాలే ఉన్నాయి. బన్నీ, సుక్కు, దేవీ కాంబినేషన్ లో పుష్ప హ్యాట్రిక్ మూవీగా రాబోతుంది. రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఆగస్టు 13న విడుదల కానున్న పుష్ప తో బన్నీ ఇండియా అంతటా పాన్ ఇండియన్ హీరోగా లాంఛ్ అవనున్నాడు.