త్వరలోనే సెట్స్ పైకి ఆడవాళ్లు మీకు జోహార్లు

Sharwanand s Adavallu Meeku Joharlu

వరుస చిత్రాలతో బిజీగా ఉన్న శర్వానంద్ శ్రీకారం ఈ నెల 11న విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన తర్వాతి సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా షూటింగ్ ను త్వరలోనే మొదలు పెడతామని టీమ్ ప్రకటించింది. నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, చిత్ర లహరి, రెడ్ సినిమాలను తెరకెక్కించిన కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రేమకథల్ని స్పెషల్ గా తెరకెక్కించే కిశోర్ తిరుమల నుంచి రానున్న సినిమా కాబట్టి ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రం తో మంచి ఫ్యామిలీ లేడీ సెంటిమెంట్ సినిమా కానుందని అందరూ నమ్ముతున్నారు.

ఇవాళ శర్వానంద్ పుట్టిన రోజు సందర్భంగా తన సినిమాల పోస్టర్లు రిలీజవుతున్నాయి. శ్రీకారం, ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్ర యూనిట్ ల నుంచి శర్వా కు బర్త్ డే విషెష్ తెలిపాయి. ఇక శర్వా బర్త్ డే కారణంగా తన ఫ్రెండ్ రామ్ చరణ్ స్వయంగా శర్వాతో కేక్ కట్ చేయించాడు. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.