యేలేటి తో వాళ్ల సినిమా ఉందా లేదా?

chandrasekhar yeleti movie in mythri movie makeers

డైరక్టర్ చంద్రశేఖర్ యేలేటి సినిమాలంటే ప్రేక్షకుల్లో ఓ మాదిరి అంచనాలున్నాయి. ఎందుకంటే ఆయన సినిమాల్లో కనిపించే స్క్రీన్ ప్లే మ్యాజిక్ అది. అయితే మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డు అందుకుని అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు యేలేటి. దీంతో టాలీవుడ్ కి మరో స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే డైరక్టర్ వచ్చాడని అందరూ అనుకున్నారు. అనుకున్నట్లుగానే రెండో సినిమా అనుకోకుండా ఒక రోజు తో మరో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. రెండో సినిమాక్కూడా బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా నంది అవార్డు దక్కించుకున్నాడు.

కానీ తన నుంచి వచ్చిన తర్వాతి సినిమాల్లో యేలేటి మార్క్ కనిపించినప్పటికీ, సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతూ వచ్చాయి. ఇప్పటి వరకు యేలేటి తీసింది ఏడు సినిమాలే అంటే తను సినిమా సినిమాకు ఎంత గ్యాప్ తీసుకుంటాడనేది అర్థం చేసుకోవచ్చు. ఒక్కడున్నాడు, ప్రయాణం, సాహసం ఇలా తన నుంచి వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినవే. కానీ 2016 లో మనమంతా అనే సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్లే అనిపించాడు యేలేటి. కానీ అప్పటి నుంచి ఆయన నుంచి మరో సినిమా రావడానికి మరో ఐదేళ్లు పట్టింది. రీసెంట్ గా అంటే 2021 లో ఆయన నుంచి చెక్ సినిమా వచ్చింది. టీజర్, ట్రైలర్లతో ఆసక్తి పెంచిన ఈ సినిమా థియేటర్లలోకి వచ్చేసరికి తేలిపోయింది.

ఇక మళ్లీ ఆయన నుంచి ఎప్పుడు సినిమా వస్తుందో తెలియదు. అసలు ఎప్పుడు తన తర్వాతి సినిమా గురించి అనౌన్స్ చేస్తారో కూడా తెలియదు. కానీ ఆయన స్క్రీన్ ప్లే కి కేవలం సాధారణ ప్రేక్షకుల్లో మాత్రమే కాదు, పెద్ద పెద్ద దర్శకులు, నటుల్లో కూడా ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. చెక్  సినిమా టైమ్ లో మైత్రీ మూవీ మేకర్స్ తో ఒప్పందం కుదరిందన్నారు. చెక్ సినిమా రిజల్ట్ బాలేదు కాబట్టి మరి ఆ ఒప్పందం ఉందా లేదా క్యాన్సిల్ అయిందా అనేది తెలియాల్సి ఉంది.