వంద కోట్ల క్లబ్ లో ఉప్పెన..

Uppena Movie 100 Cr Box Office Collections Record

100 కోట్ల క్లబ్.. ఈ ఊహ ఒక డెబ్యూ హీరోకి అసాధ్యమే చెప్పాలి కానీ ఆ అరుదైన ఫీట్ ని సాధించాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. తెరంగేట్రం చేేసిన మొదటి సినిమాతోనే ఈ రేర్ రికార్డ్ ని సాధించి అందరితో శభాష్ అనిపించుకున్నాడు. కెరీర్ స్టార్టింగ్ లోనే కుంభకోణాన్ని కొట్టాడనే చెప్పాలి. అది కూడా కరోనా క్రైసిస్ తర్వాత అందరూ అసలు ఇలాంటి రికార్డులను చూస్తామా అనుకుంటున్నా టైమ్ లో.

వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించిన ఉప్పెన టాలీవుడ్ లోనే సంచలన విజయాన్ని అందుకుని ఒక డెబ్యూ హీరోని 100 కోట్ల క్లబ్ లోకి చేర్చింది. ఈ విజాయన్ని టీమ్ మొత్తం ఎంతో సంబరంగా సెలబ్రేట్ చేసుకుంటుంది. దీనికి సంబంధించిన 100 కోట్ల పోస్టర్ ని కూడా రిలీజ్  చేసింది మైత్రీ మేకర్స్ సంస్థ. ఉప్పెనంత మీ ప్రేమకు ధన్యవాదాలంటూ తమ సంతోషాన్ని వ్యక్తం చేసింది.  

గ్రాస్ వంద కోట్లు అంటే షేర్ 50 కోట్లు. 22 రోజుల్లోనే ఇలాంటి రేర్ ఫీట్ ని అందుకుంది ఉప్పెన. బాలీవుడ్ లో హృతిక్ రోషన్, టాలీవుడ్ లో రామ్ చరణ్, అఖిల్ ల రికార్డులని వైష్ణవ్ బ్రేక్ చేయడంతో ఇప్పుడు సర్వత్రా ఆసక్తి కర చర్చ నడుస్తుంది. 

 


                    Advertise with us !!!