క్రికెట్ అభిమానులకు శుభవార్త... ఐపీఎల్ షెడ్యూల్ ఖరారు

IPL 2021 Date And Schedule T20 Tournament to Start From April 9 Final to be Played on May 30

క్రికెట్‌ అభిమానులకు శుభవార్త. ఈ యేటి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌కు సంబంధించిన డేట్స్‌ వచ్చేశాయి. 14వ ఎడిషన్‌ ఐపీఎల్‌ ఏప్రిల్‌ 9వ తేదీన ప్రారంభం కానున్నది. ఫైనల్‌ మ్యాచ్‌ మే 30వ తేదీన జరగనున్నది. అయితే దీనిని గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఆమోదం దక్కాల్సి ఉన్నది. ఈ యేటి టోర్నీకి సంబందించిన పూర్తి షెడ్యూల్‌ను త్వరలో రిలీజ్‌ చేయనున్నారు. ఇంకా వేదికలను కూడా ఖరారు చేయాల్సి ఉంది. వచ్చే వారం జరిగే భేటీలో ఐపీఎల్‌ మ్యాచ్‌లకు వేదికలను ఖరారు చేయనున్నారు. తొలుత ఒకే వేదికపై ఐపీఎల్‌ను నిర్వహించాలనుకున్నారు. కానీ మ్యాచ్‌ వేదికలను 4 నగరాలకు విస్తరించేందుకు బీసీసీఐ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్‌ నగరాలను ఐపీఎల్‌ వేదికలుగా దాదాపు ఖరారు చేసినట్లు కొన్ని వర్గాల ద్వారా తెలుస్తోంది. కరోనా వైరస్‌ నిబంధనల నేపథ్యంలో వేదికల ఎంపిక ఇబ్బందిగా మారింది. గత ఏడాది ఐపీఎల్‌ టోర్నీకి దుబాయల్‌లో నిర్వహించిన విషయం తెలిసిందే.