బాలయ్య మళ్లీ ఏసేశాడు..! అందరూ షాక్..!!

Balakrishna Slaps his Fan at Hindupur Election Campaigning

హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణకు ఆవేశం ఎక్కువని అందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడు ఎవరి మీద కోప్పడతారో చెప్పలేం. ఆయనకు కోపం వచ్చిందంటే అది పోయేవరకూ ఆయన దగ్గరకు వెళ్లాలంటే ఎవరైనా జంకుతుంటారు. అందుకే ఆయన జోలికి వెళ్లేందుకు ఎవరూ సాహసించరు. తాజాగా బాలయ్య ఉగ్రరూపం మరోసారి బయటికొచ్చింది. 

ప్రస్తుతం ఏపీలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న బాలయ్య అక్కడే ఉండి ప్రచారం నిర్వహిస్తున్నారు. మూడ్రోజులుగా అక్కడే మకాం వేశారు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యతను తన భుజాలపై వేసుకున్నారు. అందులో భాగంగా ఇవాళ నీరకంఠాపురం పరిధిలోకి వచ్చే పదో వార్డులో ప్రచారానికి వెళ్లారు బాలయ్య. అక్కడే నివాసముండే అభ్యర్థి ఇంటికి కూడా వెళ్లారు.

బాలయ్యకోసం అభ్యర్థి కుటుంబసభ్యులు జ్యూస్ అందించారు. అనంతరం.. ఎన్నికల్లో అనుసరించే వ్యూహంపై అభ్యర్థి భర్తతో రహస్యంగా చర్చిస్తున్నారు. అయితే అది రహస్యంగా మాట్లాడుతున్నారనే విషయం తెలుసుకోని అభ్యర్థి కుమారుడు ఆ సీన్ ను తన మొబైల్ లో బంధించే ప్రయత్నం చేశాడు. ఇది గమనించిన బాలకృష్ణ.. ఒక్కసారిగా పైకి లేచి చెంప ఛెళ్లుమనిపించాడు. వెంటనే ఆ వీడియో డెలీట్ చేసేయాలని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో అక్కడున్నవారంతా షాక్ కు గురయ్యారు.

బాలయ్య ఉగ్రరూపాన్ని చూసిన అక్కడివారంతా ఆశ్చర్యపోయారు. అయితే ఆ అబ్బాయిని కొట్టినవెంటనే కొంతమంది నవ్వుకోవడం బాలయ్యకు మరింత కోపం తెప్పించింది. దీంతో వెంటనే తేరుకుని వీడియో తీస్తున్న ఆ అబ్బాయిని పక్కకు తీసుకెళ్లారు. బాలయ్యకు దూరంగా అందరినీ పంపించేశారు. తర్వాత వాళ్లిద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు.

బాలయ్య చెంప ఛెళ్లుమనిపించడం కొత్తకాదు. గతంలో కూడా చాలాసార్లు అభిమానులపై చేయి చేసుకున్నాడు. అయితే బాలయ్య మనస్తత్వం చాలా మంచిదని అభిమానులు చెప్తుంటారు. అభిమానంతోనే అలా కొడ్తుంటారని పొగుడుతుంటారు. ఏదైతేనేం.. అది కోపమే, ప్రేమో... బాలయ్య చెయ్యి చేసుకోవడం మాత్రం పలువురికి ఆశ్చర్యం కలిగిస్తోంది.

 


                    Advertise with us !!!