అవుట్ సైడర్స్ ను నందిగ్రామ్ కోరుకోవడం లేదు : మమతకు రివర్స్ కౌంటర్

West Bengal Assembly Election 2021

బీజేపీ పార్టీని సీఎం మమత పదే పదే అవుట్ సైడర్స్ అంటూ సంబోధిస్తున్నారు. బెంగాలీలు బెంగాల్ బిడ్డనే కోరుకుంటున్నారు గానీ, గుజరాత్ బిడ్డలను కోరుకోవడం లేదని తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగాలని సీఎం మమత డిసైడ్ అయ్యారు. దీనిని అదునుగా చేసుకొని ఆమె ప్రత్యర్థి, బీజేపీ నేత సుబేందు అధికారి ఆమె వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ‘‘నందిగ్రామ్ నుంచి పోటీ చేయాలన్న మమత నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. అయితే మిడ్నాపూర్ బిడ్డనే ఎమ్మెల్యేగా కావాలని ప్రజలు బలీయంగా కోరుకుంటున్నారు. అవుట్ సైడర్స్‌ను ప్రజలు కోరుకోవడం లేదు. వారి డిమాండ్ కూడా ఇదే. ఎలాగూ క్షేత్రంలోకి దిగారు. మేం చూసుకుంటాం. మే 2 న మీరు ఎలాగై ఓడిపోతారు. రణరంగం నుంచి నిష్క్రమించక తప్పదు.’’ అంటూ సుబేందు ఘాటుగా మమతకు కౌంటర్ ఇచ్చారు.

అందరీ కళ్లూ నందిగ్రామ్‌వైపే......

బీజేపీకి బెంగాల్ ఎన్నికలు అత్యంత ప్రతిష్ఠాత్మకమైనవి. ఎలాగైనా బెంగాల్‌లో జెండా పాతాలని అహర్నిశలూ శ్రమిస్తోంది ఆ పార్టీ. అయితే బెంగాల్‌లోని నందిగ్రామ్‌ను కూడా బీజేపీ అంతే ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. నందిగ్రామ్ నుంచే బరిలోకి దిగుతున్నానని మమత ప్రకటించడంతో నందిగ్రామ్ పైనే అందరి కళ్లూ పడ్డాయి. పూర్వాశ్రమంలో సుబేందు అధికారి తృణమూల్‌లో ఓ చక్రం తిప్పారు. వారి కుటుంబం కొన్ని సంవత్సరాలుగా నందిగ్రామ్‌ను ఒంటిచేత్తో పాలిస్తోంది. సెజ్‌లకు వ్యతిరేకంగా ఉద్యమం జరిగిన సందర్భంలో, ఆ ఉద్యమం విజయవంతమై, తృణమూల్ మూలాలు పటిష్ఠం కావడం వెనుక సుబేందు అధికారి పాత్ర గణనీయమైంది. అంతటి సుబేందు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీలో చేరిపోయారు. మమతను 50,000 ఓట్ల తేడాతో ఓడించి తీరుతానని శపథం చేశారు. అయితే బీజేపీ మాత్రం ఇప్పటి వరకు సుబేందును తమ నందిగ్రామ్ అభ్యర్థిగా ప్రకటించలేదు. ఈ నిర్ణయాన్ని మోదీ, షా, నడ్డాకు వదిలేస్తు పార్టీ నిర్ణయం తీసుకుంది. అయితే నందిగ్రామ్ నుంచే సుబేందును రంగంలోకి దించాలని బీజేపీ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేసినట్లు తెలుస్తోంది. రేపో, మాపో ఈ నిర్ణయాన్ని వెల్లడించే అవకాశాలున్నాయి.

బీజేపీ ‘అవుట్ సైడర్స్’ పార్టీ : మమత

ఎన్నికల ప్రచారం సందర్భంగా మమత బెనర్జీ ప్రాంతీయ వాదాన్ని బలంగా లేవదీస్తున్నారు. బెంగాలీ బిడ్డనే ప్రజలు సీఎం కావాలని కోరుకుంటున్నారని పదే పదే ప్రస్తావిస్తున్నారు. బీజేపీ అవుట్ సైడర్స్ పార్టీ అని, గుజరాతీలకు బెంగాల్‌ను పాలించే హక్కే లేదంటే పరోక్షంగా మోదీ,షా పై మమత విరుచుకుపడ్డారు. పెద్ద సంఖ్యలో వాహనాల్లో తిరుగుతూ... బెంగాల్ రాజకీయాలను అవుటర్స్ భ్రష్టు పట్టిస్తున్నారని మమత తీవ్రంగా వ్యాఖ్యానించారు. అయితే దీనిపై బీజేపీ చాలాసార్లు వివరణ ఇచ్చింది. తాము అవుట్ సైడర్స్ కామని, తమ పార్టీని స్థాపించిన ముఖర్జీ బెంగాలీవారేనని గుర్తు చేశారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా దీనిపై స్పందించారు. జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామా ప్రసాద్ ముఖర్జీ అని, వారు బెంగాల్‌లోనే పుట్టారని గుర్తు చేశారు. అలాంటపుడు బీజేపీ అవుట్ సైడర్స్ పార్టీ ఎలా అవుతుందో వివరణ ఇవ్వాలని ఆయన సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా బెంగాలీ మూలాలున్న వ్యక్తే అవుతారని, అందులో ఎలాంటి సందేహమూ అవసరం లేదని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.

అందరీ కళ్లూ నందిగ్రామ్‌వైపే......

బీజేపీకి బెంగాల్ ఎన్నికలు అత్యంత ప్రతిష్ఠాత్మకమైనవి. ఎలాగైనా బెంగాల్‌లో జెండా పాతాలని అహర్నిశలూ శ్రమిస్తోంది ఆ పార్టీ. అయితే బెంగాల్‌లోని నందిగ్రామ్‌ను కూడా బీజేపీ అంతే ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. నందిగ్రామ్ నుంచే బరిలోకి దిగుతున్నానని మమత ప్రకటించడంతో నందిగ్రామ్ పైనే అందరి కళ్లూ పడ్డాయి. పూర్వాశ్రమంలో సుబేందు అధికారి తృణమూల్‌లో ఓ చక్రం తిప్పారు. వారి కుటుంబం కొన్ని సంవత్సరాలుగా నందిగ్రామ్‌ను ఒంటిచేత్తో పాలిస్తోంది. సెజ్‌లకు వ్యతిరేకంగా ఉద్యమం జరిగిన సందర్భంలో, ఆ ఉద్యమం విజయవంతమై, తృణమూల్ మూలాలు పటిష్ఠం కావడం వెనుక సుబేందు అధికారి పాత్ర గణనీయమైంది. అంతటి సుబేందు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీలో చేరిపోయారు. మమతను 50,000 ఓట్ల తేడాతో ఓడించి తీరుతానని శపథం చేశారు. అయితే బీజేపీ మాత్రం ఇప్పటి వరకు సుబేందును తమ నందిగ్రామ్ అభ్యర్థిగా ప్రకటించలేదు. ఈ నిర్ణయాన్ని మోదీ, షా, నడ్డాకు వదిలేస్తు పార్టీ నిర్ణయం తీసుకుంది. అయితే నందిగ్రామ్ నుంచే సుబేందును రంగంలోకి దించాలని బీజేపీ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేసినట్లు తెలుస్తోంది. రేపో, మాపో ఈ నిర్ణయాన్ని వెల్లడించే అవకాశాలున్నాయి.

                    Advertise with us !!!