మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

Kodali Nani Satirical Comments On MLA Balakrishna

ఆంధప్రదేశ్‍ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలోని వైసీసీ కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ బాలకృష్ణ సినిమా షూటింగుల కోసం ఇతర దేశాలు, రాష్ట్రాల్లో తిరుగుతారని అన్నారు. మన రాష్ట్రంలోని పరిస్థితులు ఆయనకు తెలియవని వ్యాఖ్యానించారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ను చదవడం తప్ప బాలయ్య ఏమీ చేయలేడన్నారు. బాలకృష్ణ ఆటలో అరటిపండు లాంటివాడంటూ కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు గురించి మాట్లాడుతూ పెద్దిరెడ్డి దెబ్బకు చంద్రబాబు చిన్న మెదడు చితికిపోయిందని, ఆయనకు మైండ్‍ చెడిపోయిన విషయం అందరికి తెలుసని అన్నారు.

విశాఖ ఉక్కు విషయంలో మోదీని ప్రశ్నించలేక జగన్‍పై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఒక శనిగ్రహం అని, ఈ విషయంలో ఎన్టీయార్‍ ఎప్పుడో చెప్పారని గుర్తు చేశారు. శని వదలాలంటే చంద్రబాబుకు పూజలు చేయాలని, వాళ్ల పార్టీ నేతలు తమ శని వదిలించుకోవడానికి చంద్రబాబు చుట్టు  తిరుగుతున్నారని నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

 


                    Advertise with us !!!