కమలం గూటికి.. బెంగాల్ కీలక నేత

West Bengal assembly polls Former TMC MP Dinesh Trivedi joins BJP

పశ్చిమబెంగాల్‍కు చెందిన రాజకీయ కురవృద్ధుడు, కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ మాజీ సభ్యుడు దినేశ్‍ త్రివేది బీజేపీలో చేరారు. నెల క్రితం వరకు తృణమూల్‍ కాంగ్రెస్‍ పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన ఫిబ్రవరి 12న తృణమూల్‍ కాంగ్రెస్‍ పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తాజాగా ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరారు. నడ్డా ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి పీయూష్‍ గోయల్‍ కూడా అక్కడే ఉన్నారు.

 


                    Advertise with us !!!