అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా... జో బైడెన్ మరో కీలక నిర్ణయం!

Joe Biden to sign women’s economic equity executive orders on March 8

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‍ మరో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. మహిళల ఆర్థిక సమానత్వానికి సంబంధించి రెండు కార్యనిర్వాహక ఉత్తర్వులపై బైడెన్‍ సంతకాలు చేయనున్నట్లు వైట్‍హౌస్‍ ప్రెస్‍ సెక్రటరీ జెన్‍ సాకి తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన ఉత్తర్వులపై సంతకాలు చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అయితే ఆ కార్యనిర్వహక ఉత్తర్వులేంటనేది సాకి మీడియాకు వెల్లడించలేదు. మహిళా సమస్యలను ప్రాధాన్యతనిస్తూ వైట్‍హౌస్‍ ఉద్యోగులు, సిబ్బంది పదవుల్లో మహిళలను నియమించడంతో పాటు, వైట్‍హౌస్‍లో ఉన్న జెండర్‍ పాలసీ కౌన్సిల్‍ ఏర్పాటు చేశారు. ఈ పాలసీ అభివృద్ధి చేసే సమయంలో అన్ని ఏజెన్సీలు, విభాగాలు మహిళల సమస్యలను పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. అదేవిధంగా పురుషులు, మహిళల మధ్య వేతన వ్యత్యసాన్ని తగ్గించడం, మహిళలు నిర్వహిస్తున్న వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం, పని ప్రదేశాల్లో వివక్షకు వ్యతిరేకంగా పోరాడటం వంటివి బైడెన్‍ హామీలను ఇచ్చిన సంగతి తెలిసిందే.

 


                    Advertise with us !!!