
విదేశీ పౌరసత్వం కలిగిన భారతీయ మూలాలు వున్న వ్యక్తుల విషయంలో కేంద్రం కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. ఓవర్సీస్ సిటిజన్ షిప్ ఆఫ్ ఇండియా కార్డు కలిగిన వ్యక్తులు ఇకపై దేశంలో తబ్లిగీ లేదా మతపరమైన కార్యక్రమాలు, మీడియా సమావేశాలు నిర్వహించాలంటే హోంశాఖ అనుమతులను తీసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. ఓసీఐ కార్డు కలిగి ఉన్న వారు మతపరమైన కార్యక్రమాలను చేపట్టాలనుకుంటే విదేశీ ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయం (ఎఫ్ఆర్ఆర్ వో)లో దరఖాస్తు చేసుకుని ప్రత్యేకంగా అనుమతులు తీసుకోవాలని కేంద్రం పేర్కొంది. విదేశీ సంస్థలకు సంబంధించి ఏదైనా ఇంటర్న్ షిప్, పరిశోధనలు చేయాలనుకునే ఓసీఐ పౌరులు అనుమతులు తీసుకోవాల్సిందేనని, అనుమతులు తీసుకున్నాక అడ్రెస్ లో ఏవైనా మార్పులు చేస్తే కచ్చితంగా ఎఫ్ఆర్ఆర్ వోకు సమాచారమివ్వాలని సూచించింది.