అమెరికా వెళ్లాలనుకునే వారికే ... ఈ సెంటర్

education-usa-center-in-hyderabad

ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాలనుకునే వారి సందేహాలు తీర్చేందుకు వై-యాక్సిస్‍ ఫౌండేషన్‍ ఏర్పాటు చేసిన ఎడ్యుకేషన్‍ యూఎస్‍ఏ సెంటర్‍ను హైదరాబాద్‍ యూఎస్‍ కాన్సులేట్‍ జనరల్‍ జోయల్‍ రీఫ్‍మ్యాన్‍ ప్రారంభించారు. జూబ్లీహిల్స్ రోడ్‍ నెంబర్‍ 36లో ఏర్పాటు చేసిన ఈ సెంటర్‍ను రీఫ్‍మ్యాన్‍తోపాటు, అమెరికా పబ్లిక్‍ ఎఫైర్స్ మినిస్టర్‍ డేవిడ్‍ కెన్నడీ, వై యాక్సిస్‍ ఫౌండేషన్‍ వ్యవస్థాపకుడు జేవియర్‍ ఆగస్టీన్‍లు ప్రారంభించారు. అమెరికా వెళ్లాలనుకునే వారికి ఉచితంగా సూచనలు, సలహాలిచ్చేందుకు ఈ సెంటర్‍ను ప్రారంభించామని తెలిపారు. దేశ వ్యాప్తంగా తమకు 8 నగరాల్లో ఎడ్యుకేషన్‍ సెంటర్లు, మరో 30 మంది సలహాదారులున్నట్లు జేవియర్‍ ఆగస్టీన్‍ తెలిపారు.

 


                    Advertise with us !!!