ఇక్కడ వైసీపీ గెలవకపోతే మాత్రం కష్టమే...?

ysrcp must win vizag municipal election

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఎక్కడ గెలిచిన గెలవకపోయినా సరే విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మాత్రం కచ్చితంగా విజయం సాధించాలి. పంచాయతీ ఎన్నికల్లో ఇక్కడ వైసిపి పెద్దగా ప్రభావం చూపించలేదు. దీనితో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మంత్రుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఇక జిల్లా ఎంపీల మీద కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా వార్తలు వచ్చాయి. అంతేకాకుండా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీరుపై కూడా జగన్ మండిపడ్డారు అంటూ కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయి.

అయితే ఇప్పుడు విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పెద్దగా ఇక్కడ ప్రభావం చూపించే అవకాశాలు కనపడటం లేదు. వాస్తవానికి విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలంగానే ఉంది. విశాఖలో చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేశారు అనే అంశాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు ముందు నుంచి కూడా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇదే వైసీపీకి ప్రధాన సమస్యగా మారుతుంది. అంతేకాకుండా మూడు రాజధానులు అని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన తర్వాత విశాఖ జిల్లాలో అవినీతి కార్యక్రమాలతోపాటు భూకబ్జాలు కూడా ఎక్కువగా జరిగాయని ఆరోపణలు ఉన్నాయి.

చాలామంది నేతలు భూకబ్జాలో పాల్గొన్నారు అని ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. ఇది వైసీపీకి ప్రధాన సమస్యగా మారింది. ఇక ముఖ్యమంత్రి జగన్ దృష్టి పెట్టకపోవడంతో కొంతమంది నేతలు జిల్లాలో ఎక్కువగా పెత్తనం చెలాయించడంతో ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి అని వైసీపీ నేతలు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నేతల మధ్య సమన్వయం కనబడటంలేదు. జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నా సరే వాళ్ళు కూడా పెద్దగా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేయడం లేదు.

అయితే ఒకవేళ మంత్రులు కష్టపడుతున్న సరే ఎమ్మెల్యేల నుంచి సహకారం రాకపోవడంతో ఇప్పుడు వైసీపీ అధిష్టానం ఇబ్బంది పడుతుంది అనే చెప్పాలి. ముఖ్యమంత్రి జగన్ సీరియస్ గా దృష్టి పెట్టినా సరే జిల్లా నేతలు మాత్రం పెద్దగా పట్టించుకునే ప్రయత్నం చేయక పోవడంతో ఇప్పుడు జగన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అందుకే ముఖ్యమంత్రి జగన్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ వైసీపీ గెలవకపోతే రాజీనామాలు చేసి తన వద్దకు రావాలి అంటూ ఆదేశాలు ఇచ్చినట్లు ప్రచారం జరిగింది.

దీనితో వైసీపీ నేతలలో కూడా ఒక రకమైన ఆందోళన నెలకొంది. మిగిలిన విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో కూడా పెద్దగా వైసీపీ ప్రభావం పడే అవకాశాలు లేవు. దీంతో జగన్ లో ఆగ్రహం పెరుగుతోంది. 2019 ఎన్నికల్లో ఉత్తరాంధ్ర నుంచి జగన్ కు మద్దతు ఎక్కువగానే వచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రభావం ఇప్పుడు కనపడటంతో జగన్ సీరియస్ గానే ముందుకు వెళ్తున్నారు. 

 


                    Advertise with us !!!