సారూ... కనీసం మీడియా తో అయినా మాట్లాడండి

MLC Elections in Telangana

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వానికి సవాలుగా మారాయి. అయినా సరే సీఎం కేసీఆర్ మాత్రం పెద్దగా ప్రచారం చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. సీఎం కేసీఆర్ ప్రచారం చేయాలని టిఆర్ఎస్ పార్టీ నేతలు ఎమ్మెల్యేలు అలాగే మంత్రులు కోరుతున్నారు. అయినా సీఎం కేసీఆర్ మాత్రం ప్రజల్లోకి రావడం లేదు. అయితే భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో అధికార పార్టీ కాస్త ఎక్కువగానే ఇబ్బంది పడుతుంది.

మంత్రులు అందరూ కలిసి ప్రచారం చేస్తున్న కొంతమంది నేతల నుంచి సహకారం లేకపోవడం తో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పడుతుంది అనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఓట్లు అడగలేని సీఎం కేసీఆర్ కి ఎందుకు ఓటు వెయ్యాలి అంటూ ఆయన ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు మీడియాలో బాగానే హైలెట్ అయ్యాయి. సీఎం కేసీఆర్ ప్రచారానికి దూరంగా ఉండటంతో అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, జగదీశ్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీవ్రంగా కష్టపడుతున్నారు. కనీసం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అయినాసరే సీఎం కేసీఆర్ ప్రచారం చేయాలని కోరుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలు ఉన్నాయి. ఇక్కడ ప్రచారం చేస్తే కలిసి వస్తుంది అని చెప్పినా సరే సీఎం కేసీఆర్ బయటకు రాకపోవడంతో ఇప్పుడు ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేస్తున్న కొన్ని కొన్ని వ్యాఖ్యలు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తున్నారు బిజెపి నేతలు.

కాబట్టి సీఎం కేసీఆర్ కనీసం మీడియా సమావేశం ఏర్పాటు చేసి అయినా సరే విమర్శలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అయినా సరే సీఎం బయటకు రాకపోవడంతో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. 2018 ఎన్నికల్లో గెలిచిన తర్వాత సీఎం కేసీఆర్ పెద్దగా ప్రజల వైపు చూసిన పరిస్థితి ఎక్కడా లేదు అని చెప్పాలి. ఇప్పుడు కూడా ఆయన ఇలాగే వ్యవహరించడంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ ఓడిపోయే అవకాశాలు ఉండవచ్చు. కనీసం రెండు మూడు బహిరంగ సభలు ఏర్పాటు చేసి అయినా సరే ప్రచారం చేస్తే ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి టిఆర్ఎస్ పార్టీ కాస్త బయటపడే అవకాశాలు ఉంటాయి. మరి ఈ విషయం కూడా తెలియని సీఎం కేసీఆర్ ఆర్ టి ఆర్ ఎస్ పార్టీ ని ఇబ్బంది పెడుతున్నారు అంటూ ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు.


                    Advertise with us !!!