పవన్ పై సైలెంట్ గా పెరుగుతున్న ఒత్తిడి

Jana Sena leaders favour own candidate in Tirupati bypoll

ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకోవడం అనేది జనసేన పార్టీ కి కలిసి వచ్చింది అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదని చెప్పాలి. పంచాయతీ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ సొంతంగా ప్రభావం చూపించింది గాని భారతీయ జనతా పార్టీ ఎక్కడా కూడా ప్రభావం చూపించలేకపోయింది. అయితే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు జనసేన పార్టీ విషయంలో మొండి పట్టుదలతో ముందుకు వెళ్తుంది అనే ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి. తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది.

ఇక బీజేపీ మాత్రం ఇక్కడ వెనక్కు తగ్గకపోవడంతో ఆగ్రహం వ్యక్తం అవుతుంది అని చెప్పాలి. రాజకీయంగా ఇపుడున్న పరిస్థితుల నేపథ్యంలో జనసేన పార్టీ ఉప ఎన్నికల్లో పోటీ చేయకపోతే భారతీయ జనతా పార్టీకి మద్దతిచ్చి సైలెంట్ గా ఉంటే జనసేన పార్టీ కూడా దాదాపుగా చచ్చిపోయే అవకాశాలు ఉండవచ్చు. తిరుపతి పార్లమెంటు పరిధిలో కాపు సామాజికవర్గం చాలా బలంగా ఉంది. కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ తన అభ్యర్ధితో బరిలోకి దిగితే మాత్రం మంచి ఫలితాలు ఉండే అవకాశాలు ఉంటాయి.

2019 ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ కాస్తోకూస్తో ప్రభావం చూపించింది. 2009 ఎన్నికల సమయంలో చిరంజీవి ఎక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన కోసం పనిచేసిన చాలామంది నేతలు ఇప్పుడు జనసేన పార్టీలో కొనసాగుతున్నారు. దీంతో చిరంజీవి ప్రచారం చేస్తే బాగుంటుందనే భావన కూడా జనసేన పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఇప్పుడు పార్టీ పోటీ చేయకుండా బిజెపి అడ్డుకుంటే మాత్రం కచ్చితంగా జనసేన పార్టీ బీజేపీతో స్నేహాన్ని కట్ చేసుకుని బయటకు రావాల్సిన అవసరం ఉంది అనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటివరకు బీజేపీ అధిష్టానం మాటలు వింటూ వచ్చిన పవన్ కళ్యాణ్ తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా పార్టీ అధిష్టానం మాట విని సైలెంట్ అయితే పార్టీ ఎక్కువగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. అందుకే ఇప్పుడు జనసేన పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ విషయంలో కాస్త సీరియస్ గానే ఉన్నారు. అలాగే పార్టీ సీనియర్ నేతలు కూడా తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మేము పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతామని బిజెపి కారణంగా అధికార వైసీపీని ఘాటుగా విమర్శించలేని పరిస్థితుల్లో ఉన్నాము అని కాబట్టి ఇప్పుడు మమ్మల్ని కట్టడి చేస్తే మాత్రం భవిష్యత్తులో మీతో కలిసి నడవలేని పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా సైలెంట్ గా ఉండటం తో కార్యకర్తలలో ఆగ్రహం పెరిగిపోతోంది.

 


                    Advertise with us !!!