సీఎస్ సోమేశ్ కుమార్ తో ఈస్తోనియా అంబాసిడర్ భేటీ

estonian-ambassador-meets-telangana-cs-somesh-kumar

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ను ఈస్తోనియా అంబాసిడర్‌ కార్టిన్‌ కిని, డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ మిషన్‌ జూహి హియో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రంలో అమలు అవుతున్న అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలను వారికి వివరించారు. ఇందులో భాగంగా చేపట్టిన ల్యాండ్‌ రికార్డ్స్‌ డిజిటలైజేషన్‌, ఇ-గవర్నెన్స్‌, సైబర్‌ సెక్యూరిటీ వంటి విషయాలను ఉదహరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కల్పించిన అవకాశాలను ఉపయోగించుకుని తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని ఈస్తోనియా డెలిగేట్స్‌ను సీఎం కోరారు. ఈ సమావేశంలో ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వీ, ప్రోటోకాల్‌ జాయింట్‌ సెక్రటరీ అర్విందర్‌ సింగ్‌ తదితర అధికారులు పాల్గొన్నారు.

 


                    Advertise with us !!!