
తెలుగురాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ రంగంలో పేరు పొందిన ఫీనిక్స్ గ్రూప్ నుంచి వచ్చిన సతీష్ చుక్కపల్లి తన బిజినెస్‌కు సాంకేతికతను జోడించి ఓ క్రమపద్ధతిలో నీతిగా, నిజాయితీగా పారదర్శకంగా ఆర్గనైజ్డ్గా వ్యాపారం చేయాలన్నదే తన విధానమని అంటూ, తన ఆశయాలకు అనుగుణంగా సిభా గ్రూపును ప్రారంభించారు. రియల్ ఎస్టేట్, టెక్స్టైల్స్, మైనింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్, మీడియా విభాగాలను ఏర్పాటు చేసి కార్పొరేట్ రంగంలో సిభా ప్రారంభమే ఓ సంచలనంగా మార్చారు. తన గ్రూపు కంపెనీ నిర్వహణ, ప్లానింగ్, బిజినెస్ వ్యవహారాలను ఈ విధంగా తెలియజేశారు.
సిభా రియల్ ఎస్టేట్ విభాగం- Sibha Infratech
తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా, దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఫీనిక్స్ గ్రూప్ లో 11 సంవత్సరాలు డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించి, 2020 లో సిభా గ్రూపుని ప్రారంభించిన సతీష్ చుక్కపల్లి మాట్లాడుతూ, మనదేశంలో వ్యవసాయం తరువాత ఎక్కువమంది ఆధారపడేది రియల్ ఎస్టేట్ రంగంలోనే అని, కానీ ఈ రెండు రంగాలను అన్ ఆర్గనైజ్డ్ (ఓ పద్ధతి ప్రకారం నిర్వహించని) రంగాలుగా చెబుతారని, దానికి కారణం ఆ రంగంలో నిర్వహించే విధానాలు, పద్ధతులే కారణమన్నారు. అమెరికా, యూరప్ దేశాల్లో రియల్ ఎస్టేట్ రంగం ఒక ఫార్మా, ఒక ఐటీ రంగం లాగా పూర్తిగా ప్రొఫెషనల్‌గా నిర్వహిస్తారని అంటూ, ఆ విధంగానే సిభా గ్రూపులోని రియల్ ఎస్టేట్ విభాగంను కూడా పూర్తిస్థాయిలో స్టాండర్డ్ పద్ధతులు, పారదర్శకత విధి విధానాలు, నిష్ణాతులైన ఉద్యోగులతో నడిచే విధంగా ఏర్పాటు చేశామన్నారు. అంటే అన్నీ పనులు సంస్థ ప్రారంభించిన యజమాని అనే ఒక వ్యక్తి లేదా గ్రూపు కాకుండా నిర్మాణంలో మంచి అనుభవం ఉన్నవారితో నిర్మాణం పనులు, ఆర్కిటెక్ట్‌తో ఆర్కిటెక్చర్, ప్లానింగ్ తెలిసినవారితోనే ప్లానింగ్ పనులు చేయిస్తామని, గ్రూపు యాజమాన్యం కేవలం ప్లానింగ్‌లోనూ, క్వాలిటీ కంట్రోల్లో మాత్రమే జోక్యం చేసుకుంటుందన్నారు. ఈ పద్ధతిలోనే సిభా గ్రూపు రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పటికే పేరున్న ఇతర సంస్థలు, బిల్డర్స్‌తో భాగస్వామ్యం తీసుకుని ప్రాజెక్టులోకి పెట్టుబడి తీసుకువచ్చి, పారదర్శకతతో క్రమశిక్షణతో ప్రాజెక్ట్ పూర్తి చేసి పార్ట్నర్కి, ఇన్వెస్టర్‌కి, చివరగా కస్టమర్‌కి జవాబుదారీగా ఉంటుందని తెలిపారు. ఇంకా ఈ విషయంపై వివరిస్తూ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న రిస్క్‌లను అర్థం చేసుకుని, వాటిని పూర్తిగా తొలగించి లేదా సాధ్యమైనంత తక్కువ చేసి సిభా గ్రూపులోని రియల్ ఎస్టేట్ విభాగం పనిచేస్తుందని తెలిపారు.
సిభా టెక్స్టైల్స్ విభాగం - Textiles Station
తమ కుటుంబసంస్థ ఫీనిక్స్ గ్రూప్ లోకి రాకముందే సతీష్ చుక్కపల్లి దాదాపు 18 సంవత్సరాలు తమిళనాడులోని కోయంబత్తూరులో టెక్స్టైల్ రంగంలో గార్మెంట్స్ తయారీ మరియు ఎగుమతి లలో విజయం సాధించిన అనుభవంతో సిభా గ్రూపులో టెక్స్టైల్ విభాగంను కూడా ఏర్పాటు చేశారు. ఈ విభాగం గురించి సతీష్ చుక్కపల్లి మాట్లాడుతూ, టెక్స్టైల్ రంగం కూడా చాలా ఆన్ఆర్గనైజ్డ్గా ఉంటుందని, అయితే తాను స్వయం గా ఒక జర్మన్ కంపెనీ ని పార్టనర్ గ ప్రారంభించి, నడిపిన సమయంలోనే సంస్థలు, ఆధునికయంత్రాంగంతో, శాస్త్రీయ పద్ధతులతో చిన్న సంస్థ నుంచి అంతర్జాతీయ సంస్థగా ఎదగడం చూశానని ఆ పరిణామంలో తాను కూడా కీలకపాత్ర పోషించానని, ఆ అనుభవంతోనే సిభా గ్రూపులో టెక్స్టైల్ విభాగంను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ విభాగంలో టెక్స్టైల్ రంగంలో అతి ముఖ్యమైన కాటన్ గార్మెంట్స్ తయారు చేసి యూరప్ ఇతర విదేశాలకు ఎగుమతి చేయడానికి ప్రణాళికలు తయారు చేసుకున్నామని ఆ ప్రణాళిక ప్రకారమే ఈ విభాగం కూడా నడుస్తుందని తెలిపారు. ఇక్కడ కూడా గ్రూపు పాలసీ ప్రకారం నిష్ణాతులు పనిచేస్తారని, ఆ విభాగానికి కావాల్సిన పెట్టుబడిని అందించడం, ప్రాజెక్ట్ నడవడానికి కావాల్సిన ప్రణాళికను తయారు చేసి, వాటిని అమలు చేయడాన్ని సిభా పర్యవేక్షిస్తుందని తెలిపారు.
సిభా సేంద్రీయ వ్యవసాయం - Zameen Organic
చుక్కపల్లి కుటుంబం వ్యవసాయ నేపథ్యం కలిగిన కుటుంబం. అక్కడ నుంచి వ్యాపారంలో కూడా ఆధునిక మెళకువలు తెలుసుకుని వ్యాపారరంగంలోకి అడుగుపెట్టిన సతీష్ చుక్కపల్లి 'జమీన్ ఆర్గానిక్' పేరుతో సేంద్రీయ వ్యవసాయ విభాగంను కూడా తమ సిభా గ్రూపులో ఏర్పాటు చేశారు. ఈ విభాగం గురించి మాట్లాడుతూ, టెక్స్టైల్స్ రంగం విజయవంతంగా నడవాలంటే దానికి కావాల్సిన ముడిసరుకులు అందించే సరఫరా విభాగం పటిష్టంగా ఉండాలని, ఇప్పుడు సిభాలో టెక్స్టైల్ విభాగం తయారు చేయబోయే గార్మెంట్స్ తయారీ మరియు ఎగుమతికి కాటన్ (పత్తి) చాలా అవసరం. దానిని దృష్టిలో పెట్టుకునే తెలంగాణ-మహారాష్ట్ర బోర్డర్లో 200 గ్రామాల్లో దాదాపు 18000 ఎకరాల్లో సేంద్రీయ వ్యవసాయం ద్వారా పత్తి ని పండిస్తున్నామని తెలిపారు. ఈ వ్యవసాయదారులకు పూర్తిస్థాయిలో అవగాహన కార్యక్రమం నిర్వహించి వారికి మధ్య లో పప్పులు, సొయా లాంటి cash crops పండించి ఆదాయం పెంచుకోవటం నేర్పమని, అలాగే, పశువులు (cattle) ఉంటే వాటి ద్వారా ఎలా ఆదాయం వస్తుందో, వాటి ద్వారా వచ్చే పేడతో దానిని బయోగ్యాస్‌గా ఎలా వాడవచ్చో కూడా తెలియజేశామన్నారు. పంటలో వచ్చిన పత్తి ని మార్కెట్ ధరకంటే లాభంగా ఏ విధంగా అమ్మవచ్చోలాంటి అనేక విషయాలను తెలియజేశామన్నారు. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి చూసి చుట్టుప్రక్కలలోని గ్రామాలలోని చిన్నకారు రైతులు, భూస్వాములు కూడా ఆసక్తిని చూపిస్తున్నారని, తమ జమీన్ ఆర్గానిక్ విభాగం చాలా వేగవంతంగా విస్తరిస్తోందని సతీష్ చుక్కపల్లి తెలిపారు.
మీడియా విభాగం
శ్రీ సతీష్ చుక్కపల్లి మాట్లాడుతూ అమెరికా లో గత 17 సంవత్సరాలుగా ప్రచురణ లో వున్న తెలుగు టైమ్స్ పత్రిక & పోర్టల్ ని సిభా గ్రూప్ స్వీకరించిందని చెపుతూ, ఫీనిక్స్ కంపెనీ బ్రాండ్ ని ఇమేజ్ ని అంతర్జాతీయంగా తెలిసేలా చేయటం కోసం, ముఖ్యం గా అమెరికా లో తెలుగు సంఘాల తో పరిచయం పెంచుకోవటం లో తెలుగు టైమ్స్ తమకు సహాయం చెసిందని, ఒక మీడియా సంస్థ ఉంటే గ్రూప్ కార్య క్రమాలను, విధి విధానాలను తమ టార్గెట్ గ్రూప్ చెరచటం లో చాల ముఖ్య మైన పాత్ర వహిస్తుందని తెలిసింది అని తెలిపారు.